సూర్యకాంతితో ప్రసూతి చాలా తేలిక...!
సన్ ప్రివెంట్స్ ద పెయిన్
గర్భవతుల్లో విటమిన్ డీ లోపం ఉంటే వారిలో ప్రసూతి చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. గర్భవతుల్లో విటమిన్-డి లోపం రావడం చాలా సాధారణమైన విషయం. ప్రత్యేకంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్నవారికీ, కేవలం శాకాహారం మాత్రమే తీసుకునేవారికీ, ఎండలో ఎక్కువగా తిరగని వారికి ప్రసవం కష్టమవుతుంది. దీనికి కారణం - విటమిన్ ‘డి’ లోపమే. అందుకే ఇలాంటి వారికి ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించే ‘ఎపిడ్యూరల్’ ప్రొసిజర్స్ అవసరమవుతాయి.
ఇటీవలే నిర్వహించిన అనస్థీషియాలజిస్టుల వార్షిక సమావేశంలో కొందరు పరిశోధకులు దాదాపు 100 మంది గర్భవతులపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని అధ్యయన వేత్తలు తెలిపారు. అందుకే మహిళలు గర్భం దాల్చాక తగినంతగా ఎండపొడకు తిరగాలని వారు పేర్కొంటున్నారు.