శబరిమల క్షతగాత్రుల వివరాలపై ఆరా
కొత్తపేట :
శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం వద్ద తొక్కిసలాట క్షతగాత్రులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం రాత్రి అయ్యప్ప ఆలయం వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటనలో కొత్తపేటకు చెందిన చొప్పెల్ల బుచ్చిరాజు, ఆయన బావ పసలపూడి శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరు కొట్టాయం ఆస్పత్రిలో కోలుకుంటున్నారని వారితో ఉన్న కంకటాల సాంబమూర్తి తెలిపారు. కాగా రాష్ట్ర దేవాదాయ శాఖ చర్యల్లో భాగంగా క్షతగాత్రుల వివరాలు, కొట్టాయం నుంచి వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధతో పాటు డీసీ రమేష్‌బాబు (కాకినాడ) స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కొత్తపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ దూనబోయిన నారాయణరావు సోమవారం క్షతగాత్రుల ఇళ్లకు వెళ్లి, వివరాలు తెలుసుకున్నారు. బుచ్చిరాజు కుమారుడు నాగమణికంఠ అర్జు¯ŒSగుప్త (అయ్యప్ప)ను వెంటపెట్టుకుని మంగళవారం కొట్టాయానికి బయలుదేరనున్నట్టు ఆయన తెలిపారు.