సీనియర్లకు అవకాశం దక్కేనా?
ప్రపంచకప్‌కు భారత ప్రాబబుల్స్ ప్రకటన నేడు
30 మందితో జాబితా
న్యూఢిల్లీ: సీనియర్లు, జూనియర్లు అనే సంబంధం లేకుండా వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ప్రతి భారత క్రికెటర్ కలగంటున్నాడు. మరి వీరిలో ఎంతమంది కల సాకారమయ్యే అవకాశం ఉందో గురువారం తేలనుంది. మెగా టోర్నీ కోసం 15 మందితో తుది జాబితాను జనవరి 7న ప్రకటించాలి. దానికంటే ముందు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియను సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం నేడు ప్రారంభించనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు సెలక్టర్లు సమావేశమవుతున్నారని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.
ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రపంచకప్ జరుగుతుంది. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, హర్భజన్, ఆశిష్ నెహ్రా లతో పాటు జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్లను ప్రాబబుల్స్‌లోకి పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరం. దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న మనోజ్ తివారీ, మనీశ్ పాండే, సూర్యకుమార్, బాబా అపరాజిత్ల పేర్లు జాబితాలో ఉండొచ్చు.