Sunil Gawaskar
-
T20 WC: కోహ్లి, రోహిత్‌లను తప్పక ఆడించాలి: టీమిండియా దిగ్గజం
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయాలని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆకాంక్షించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరు సూపర్ ఫామ్‌లో ఉన్నారని.. టీ20 ప్రపంచకప్ నాటికి జట్టుతో చేరితే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడన్న గావస్కర్.. వన్డే వరల్డ్‌ప్-2023లో అద్భుత ప్రదర్శనతో వింటేజ్ కోహ్లిని గుర్తుకుతెచ్చాడన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ ఈవిధంగానే రాణించగల సత్తా అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్ 4 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. మరోవైపు.. ఈ మెగా టోర్నీకి ముందు భారత్‌కు ఇంకా కేవలం మూడు టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఇందుకు సంబంధించిన సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్‌తో తిరిగి టీమిండియా తరఫున టీ20లలో ఎంట్రీ ఇస్తేనే.. వరల్డ్‌కప్ ఆడే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరంగా ఉన్నారు కాబట్టి విరాహిత్ ద్వయం పునరాగమనం పక్కా అని విశ్లేషుకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. కోహ్లి, రోహిత్‌లకు అంతర్జాతీయ టీ20లలో ఇంకా భవిష్యత్తు మిగిలే ఉందన్నాడు. ఈ మేరకు.. ‘‘గత ఏడాదిన్నర కాలంగా విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడిన తీరును అందరం చూశాం. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి భవిష్యత్తు ఉందా? లేదా అన్న అంశం మీద చర్చ అనవసరం. కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇప్పటికీ వీరిద్దరు అత్యద్భుతమైన ఫీల్డర్లుగా కొనసాగుతున్నారు. చాలా మంది 35-36 ఏళ్లు వచ్చేసరికి స్లో అయిపోతారు. వీళ్లిద్దరు మాత్రం ఇందుకు మినహాయింపు. ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ క్యాచ్‌లు అందుకోవడం చూస్తూనే ఉన్నాం’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో రోహిత్, కోహ్లిల ఆట తీరును ప్రశంసించాడు. అయితే, కేవలం ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్నారన్న ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా సీనియారిటి, బ్యాటింగ్ నైపుణ్యాల ఆధారంగా వారిని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుందని గావస్కర్ ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా వరల్డ్‌కప్ కంటే ముందు టీమిండియాతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్-2024 ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది. -
‘వయసొచ్చాక అక్షయ్ ఇలానే ఉంటాడు’
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ విడుదలై భారీ విజయం సాధించించడంతో ఖిలాడి అక్షయ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా మరో కొత్త విషయంతో ఖిలాడి మళ్లీ సోషల్ మీడియాకెక్కాడు. కాశ్మీర్‌కి చెందిన ఓ వృద్ధుడి ఫోటో ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో అక్షయ్ వైరల్ అయ్యాడు. దానికి అక్షయ్‌కు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? భారత్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టోపి ధరించేవాడని అందరి తెలిసిన విషయమే.. అయితే అది మతపరంగా ధరించేవాడని అప్పట్లో అందరు అనుకుంటూండేవారు. అలాగే కాశ్మీర్ చెందిన మాజిద్ మీర్ అచ్చం అలాంటి టోపీనే రోజు ధరిస్తాడంటా. అతను కూడా మతపరంగా ధరించడం గమనార్హం. అయితే ఆయన తన ఫోటోను ‘ఇక్కడ చుడండి ఈ వృద్ధుడు ఓ క్రికెటర్ అభిమాని, అందుకె ఇతనిని లిటిల్ మాస్టర్ అంటూ ఉంటారని’ అనే క్యాప్షన్‌తో ఎవరో షేర్ చేశారు. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ‘ఇతనికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి, వయసు వచ్చిన తర్వాత అక్షయ్ ఇలానే ఉంటాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఖిలాడికి 2019 బాగా కలిసొచ్చిందని చెప్పుకొవచ్చు. ఈ ఎడాది మార్చిలో అక్షయ్ నటించిన కేసరి సినిమా విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఆగష్టులో విడుదలైన మిషన్ మంగళ్ కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. Met a Kashmiri Fan of Sunil Gavasker, Majid Mir in #Kashmir Wears that hat everyday religiously 👍🏻👍🏻 pic.twitter.com/jNcHx5GJSK — Ashish/Aashu (ABP News) (@AshishSinghLIVE) August 28, 2019 -
సచిన్‌కు ఆ కానుక ఇవ్వాలి
మళ్లీ గెలుపు బాట పట్టాలని ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పట్టుదలతో ఉన్నాయి. గత మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు కొద్ది తేడాతో విజయాన్ని చేజార్చుకున్నాయి. డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సేవలు లేకపోవడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఏదో వెలితి కనిపించింది. ధావన్ ఉంటే దూకుడుగా ఆడటంతోపాటు స్కోరు బోర్డును పరిగెత్తిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు. అయితే అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. సన్‌రైజర్స్ సమస్యల్లా నిలకడలేమి. ఎక్కువసార్లు ఆ జట్టు ఎవరో ఒకరి ప్రదర్శనతో గట్టెక్కుతోంది. ఎల్లప్పుడూ సీనియర్లు జట్టును ఆదుకోవాలంటే కష్టమే. వార్నర్ గైర్హాజరీలో ధావన్, విలియమ్సన్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. మనీశ్ పాండేలాంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తే వీరిపై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ జట్టు బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జోరుమీదున్నారు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ తడబడుతుండటంతో ఆ జట్టు చివరికొచ్చేసరికి ఊహించిన స్కోరుకన్నా 20 పరుగులు తక్కువ చేస్తోంది. నేడు సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై సమష్టిగా రాణించి, జట్టు మెంటార్, దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజున అతనికి సొంత మైదానంలో గెలుపు కానుక ఇవ్వాలని ఆశిస్తున్నాను. -
సియట్ క్రికెట్ అవార్డుల ప్రదానం