
మళ్లీ గెలుపు బాట పట్టాలని ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పట్టుదలతో ఉన్నాయి. గత మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు కొద్ది తేడాతో విజయాన్ని చేజార్చుకున్నాయి. డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సేవలు లేకపోవడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఏదో వెలితి కనిపించింది. ధావన్ ఉంటే దూకుడుగా ఆడటంతోపాటు స్కోరు బోర్డును పరిగెత్తిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు. అయితే అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. సన్‌రైజర్స్ సమస్యల్లా నిలకడలేమి. ఎక్కువసార్లు ఆ జట్టు ఎవరో ఒకరి ప్రదర్శనతో గట్టెక్కుతోంది. ఎల్లప్పుడూ సీనియర్లు జట్టును ఆదుకోవాలంటే కష్టమే. వార్నర్ గైర్హాజరీలో ధావన్, విలియమ్సన్‌లపై తీవ్ర ఒత్తిడి ఉంది.
మనీశ్ పాండేలాంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తే వీరిపై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ జట్టు బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జోరుమీదున్నారు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ తడబడుతుండటంతో ఆ జట్టు చివరికొచ్చేసరికి ఊహించిన స్కోరుకన్నా 20 పరుగులు తక్కువ చేస్తోంది. నేడు సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై సమష్టిగా రాణించి, జట్టు మెంటార్, దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజున అతనికి సొంత మైదానంలో గెలుపు కానుక ఇవ్వాలని ఆశిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment