mubai indians
-
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్లు వీరే..
జెద్దా వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ రషీద్ ఇప్పటికే ఐపీఎల్లో ఓసారి సీఎస్కే జట్టులో భాగం కాగా.. అవినాష్, సత్యనారాయణలకు మాత్రం తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కింది.విశాఖపట్నంకు చెందిన అవినాష్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా 24 ఏళ్ల అవినాష్‌కు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో బెజవాడ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఏపీఎల్-2024 సీజన్లో అవినాష్ అదరగొట్టాడు. కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని పంజాబ్ సొంతం చేసుకుంది. మరోవైపు కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగొలు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న సత్యనారాయణ.. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. ఇప్పటివరకు కేవలం 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతడు 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ముంబై తమ జట్టులో చేర్చుకుంది. ఇక గుంటూరు క్రికెటర్ షేక్ రషీద్‌ను మరో సారి సీఎస్కే సొంతం చేసుకుంది. అతడు కూడా తన బేస్ ప్రైస్ రూ.30 లక్షలకే అమ్ముడుపోయాడు. -
పేస్ భళా బెంగళూరు
ఒక్క ఓవర్. ఒకే ఒక్క ఓవర్ టి20 మ్యాచ్ మొత్తాన్నే మలుపు తిప్పుతుందనే విషయం మళ్లీ తేటతెల్లమైంది. మెక్లీనగన్ ఆ ఒక్క ఓవర్ ముంబైకి శాపమైతే... రాయల్ చాలెంజర్స్‌కు వరమైంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అప్పటిదాకా మూడు ఓవర్లు వేసిన మెక్లీనగన్ 10 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ చివరిదైన 20వ ఓవర్లో ఏకంగా 24 పరుగులివ్వడం ముంబై కొంపముంచింది. దీంతో బెంగళూరు స్కోరు 143/7 నుంచి 167/7కు పెరిగితే... ముంబై 153/7 స్కోరు వద్ద కట్టడై పరాజయం చవిచూసింది. బెంగళూరు: ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్–11లో మంగళవారం ఇరు జట్లకు కీలకమైన పోరులో చాలెంజర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (31 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడగా, మెకల్లమ్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (3/28) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. బెంగళూరు పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌతీ తలా రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు. సౌతీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణించిన వోహ్రా టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన ఓపెనర్లు డికాక్, మనన్ వోహ్రా చెప్పుకోదగ్గ ఆరంభం ఇవ్వలేకపోయారు. మూడు ఓవర్లు ముగిసే సరికి 11 పరుగులే చేశారు. ఆ తర్వాత వోహ్రా ఒక్కసారిగా చెలరేగాడు. డుమిని వేసిన నాలుగో ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లతో 22 పరుగులు పిండుకున్నాడు. అతను ధాటిగా ఆడుతుంటే... డికాక్ (7) మాత్రం తడబడ్డాడు. జట్టు స్కోరు 38 పరుగుల వద్ద మెక్లీనగన్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వోహ్రాకు మెకల్లమ్ జతయ్యాడు. ఇద్దరు వేగం పెంచుతున్న దశలో మార్కండే బౌలింగ్ వోహ్రా వికెట్ల ముందు దొరికిపోయాడు. 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో కోహ్లి క్రీజ్‌లోకి రావడంతో స్కోరు పుంజుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన పదో ఓవర్లో మెకల్లమ్ 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 20 పరుగులు రాబట్టాడు. ఇద్దరూ అదుపు తప్పిన బంతుల్ని బౌండరీలుగా మలచి స్కోరు బోర్డును పరుగెత్తించారు. మూడో వికెట్‌కు 5.5 ఓవర్లలో 60 పరుగులు జోడించాక మెకల్లమ్ లేని పరుగుకు ప్రయత్నించడం... హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటు వేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మన్దీప్ (10 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. అతనితో పాటు కోహ్లి (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్)ని హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో పాటు వాషింగ్టన్ సుందర్ (1) వికెట్‌నూ ఔట్ చేయడంతో బెంగళూరు ఇన్నింగ్స్ గతితప్పింది. మూడు వికెట్లు కోల్పోయిన చాలెంజర్స్ స్కోరు ఒక్కసారిగా మందగించింది. అయితే చివరి ఓవర్లో గ్రాండ్‌హోమ్ 3 భారీ సిక్సర్లతో జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. ముంబై బౌలర్లు మార్కండే, మెక్లీనగన్, బుమ్రా తలా ఒక వికెట్ తీశారు. ఒకే ఒక్కడు హార్దిక్ పాండ్యా ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... ముంబై బ్యాట్స్‌మెన్ ఆరంభంలోనే తడబడ్డారు. సౌతీ వేసిన తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఉమేశ్ యాదవ్ తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ నాలుగోది)లో రెండు కీలక వికెట్లను తీసి ముంబైని ఆత్మరక్షణలో పడేశాడు. తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ (9)ను ఎల్బీగా వెనక్కి పంపిన ఉమేశ్ తర్వాతి బంతికి రోహిత్ శర్మ (0)ను కీపర్ క్యాచ్‌తో డకౌట్ చేశాడు. దీంతో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన పొలార్డ్ (13), డుమిని (29 బంతుల్లో 23; 3 ఫోర్లు) కాసేపు నిలువగలిగారే కానీ లక్ష్యం దిశగా నడిపించలేకపోయారు. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం ఆఖరి ఓవర్‌దాకా కష్టపడ్డాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి విజయం కోసం విఫలయత్నం చేశాడు. ఇద్దరు ఆరో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. సీమర్ సిరాజ్ 19 ఓవర్లో కృనాల్‌ను ఔట్ చేసి కేవలం 5 పరుగులే ఇవ్వడం బెంగళూరుకు కలిసొచ్చింది. దీంతో ఆఖరి ఓవర్లో 25 పరుగులు చేయాల్సివుండగా సౌతీ వేసిన తొలిబంతికే హార్దిక్ పాండ్యా నిష్క్రమించడంతో ముంబైకి మిగిలున్న ఆశలు ఆవిరయ్యాయి. హార్దిక్ లాంగాన్‌లో భారీషాట్ కొట్టగా కోహ్లి మెరుపువేగంతో డైవ్ చేసి క్యాచ్‌ను అందుకున్నాడు. -
ముంబై ‘పార్టీ’ మునిగింది
ఒకవైపు వాంఖడే స్టేడియం మొత్తం సచిన్ నామస్మరణతో ఊగిపోతోంది... స్వయంగా టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీమ్ జెర్సీలో కుటుంబ సభ్యులతో మైదానానికి వచ్చి అక్కడే తన పుట్టిన రోజు కేక్ కట్ చేశాడు... దిగ్గజ క్రికెటర్‌కు విజయాన్ని కానుకగా ఇవ్వాలని భావించిన ముంబై సగం ఆట ముగిసేసరికి తమ ప్రయత్నంలో సఫలమైనట్లే కనిపించింది. 119 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఫటాఫట్‌గా ఛేదించి ఇక బర్త్‌డే పార్టీ చేసుకోవడమే మిగిలిందని అనిపించింది... కానీ సచిన్‌నే కాదు మొత్తం ముంబైకర్లను రోహిత్ బృందం తీవ్ర నిరాశకు గురి చేసింది. పేలవమైన బ్యాటింగ్‌తో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. 87 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతో ముంబై మూగబోయింది. ముంబై: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని దక్కించుకుంది. బ్యాటింగ్ వైఫల్యం తర్వాత ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో బౌలింగ్‌తో చెలరేగి కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. విలియమ్సన్ (21 బంతుల్లో 29; 5 ఫోర్లు), యూసుఫ్ పఠాన్ (33 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మోస్తరు ప్రదర్శన చేశారు. మయాంక్ మార్కండే, హార్దిక్ పాండ్యా, మెక్లీనగన్ పొదుపైన బౌలింగ్‌తో పాటు తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 34; 4 ఫోర్లు), కృనాల్ పాండ్యా (20 బంతుల్లో 24; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. సిద్ధార్థ్ కౌల్ 3 వికెట్లు తీయగా, థంపి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రషీద్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ఒకరి వెనుక మరొకరు... పవర్‌ప్లే ముగిసేసరికి 51 పరుగులకే 4 వికెట్లు... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని ఇది చూపిస్తోంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లో విలియమ్సన్ కొట్టిన రెండు ఫోర్లతో శుభారంభం లభించినట్లు అనిపించినా కొద్ది సేపటికి రైజర్స్ పరిస్థితి తారుమారైంది. మెక్లీనగన్ రెండు బంతుల తేడాతో శిఖర్ ధావన్ (5), సాహా (0)లను ఔట్ చేసి హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. మరో ప్రధాన బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే (16) వరుస వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఆ వెంటనే విలియమ్సన్తో సమన్వయ లోపంతో షకీబ్ (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. మెక్లీనగన్ వేసిన బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపు ఆడిన విలియమ్సన్ సింగిల్ కోసం షకీబ్‌ను పిలిచి ఆపై నిరాకరించాడు. షకీబ్ వెనక్కి వెళ్లే లోపు సూర్య కుమార్ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను హార్దిక్ ముగించాడు... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న నబీ (14), రషీద్ (6), థంపి (3) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. చివర్లో పఠాన్ కూడా స్థాయికి తగినట్లుగా ఆడలేకపోవడంతో ఐపీఎల్లో రైజర్స్ తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 19వ ఓవర్ మూడో బంతికి పఠాన్ ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ కొట్టడానికి ముందు సన్ జట్టు వరుసగా 34 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది. సూర్యకుమార్ మినహా... స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఇన్నింగ్స్ కూడా తడబాటుతో ప్రారంభమైంది. భువనేశ్వర్ లేకపోయినా సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని నిలువరించింది. 9 పరుగుల వ్యవధిలో ముంబై మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. లూయీస్ (5), ఇషాన్ కిషన్ (0)లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (2) కూడా వెంటవెంటనే ఔట్ కావడంతో ముంబై స్కోరు 21/3 వద్ద నిలిచింది. ఈ దశలో సూర్య కుమార్, కృనాల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సూర్య కుమార్ క్రీజ్‌లో నిలదొక్కుకోగా, కౌల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కృనాల్ దూకుడు ప్రదర్శించాడు. అయితే 40 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం అనంతరం రషీద్ చక్కటి బంతితో కృనాల్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. పేలవ షాట్‌కు పొలార్డ్ (9) నిష్క్రమించడంతో ఒక్కసారిగా ముంబైపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆశలు పెట్టుకున్న సూర్య కుమార్‌ను థంపి అవుట్ చేయడంతో పరిస్థితి తలకిందులైంది. హార్దిక్ పాండ్యా (3) కూడా ఏమీ చేయలేకపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ► టి20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. అంతకుముందు నరైన్, బ్రేవో, ఆఫ్రిది, మలింగఈ ఘనత సాధించారు. -
సచిన్‌కు ఆ కానుక ఇవ్వాలి
మళ్లీ గెలుపు బాట పట్టాలని ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పట్టుదలతో ఉన్నాయి. గత మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు కొద్ది తేడాతో విజయాన్ని చేజార్చుకున్నాయి. డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సేవలు లేకపోవడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఏదో వెలితి కనిపించింది. ధావన్ ఉంటే దూకుడుగా ఆడటంతోపాటు స్కోరు బోర్డును పరిగెత్తిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు. అయితే అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. సన్‌రైజర్స్ సమస్యల్లా నిలకడలేమి. ఎక్కువసార్లు ఆ జట్టు ఎవరో ఒకరి ప్రదర్శనతో గట్టెక్కుతోంది. ఎల్లప్పుడూ సీనియర్లు జట్టును ఆదుకోవాలంటే కష్టమే. వార్నర్ గైర్హాజరీలో ధావన్, విలియమ్సన్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. మనీశ్ పాండేలాంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తే వీరిపై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ జట్టు బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జోరుమీదున్నారు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ తడబడుతుండటంతో ఆ జట్టు చివరికొచ్చేసరికి ఊహించిన స్కోరుకన్నా 20 పరుగులు తక్కువ చేస్తోంది. నేడు సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై సమష్టిగా రాణించి, జట్టు మెంటార్, దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజున అతనికి సొంత మైదానంలో గెలుపు కానుక ఇవ్వాలని ఆశిస్తున్నాను. -
చెన్నై చమక్
ఐపీఎల్ సీజన్ తొలి పోరు. తలపడుతున్నది దిగ్గజ జట్లు. అటు ఇటు మంచి హిట్టర్లు. అయినా సాదాసీదా ప్రదర్శన. ‘ఇదేం ఆట’ అంటూ నిట్టూర్పులో అభిమానులు! కానీ ఒకే ఒక్కడు మలుపు తిప్పాడు. ప్రేక్షకులను రంజింపజేశాడు. పేలవంగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చాడు. ఓటమి ఖాయమనుకున్న తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతడే డ్వేన్ బ్రేవో. అతడి దెబ్బకు ముంబై విసిరిన లక్ష్యం ‘బ్రేవ్ బ్రేవ్’మంటూ కరిగిపోయింది. చెన్నైకు అనూహ్య గెలుపు దక్కింది. ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఘన పునరాగమనం. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన డ్వేన్ బ్రేవో (0/25), అనంతరం బ్యాటింగ్ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)లోనూ విరుచుకుపడటంతో శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్–11వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు వికెట్ తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. బ్రేవో దూకుడుతో చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. బ్రేవోకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు వాట్సన్ (16), రాయుడు (22) చెన్నై ఇన్నింగ్స్‌ను కొంత మెరుగ్గానే ఆరంభించారు. వీరితో పాటు రైనా (4), ధోని (5) తర్వగా అవుటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ముందుగా వచ్చిన జడేజా (12) నిరాశపరిచాడు. ఈలోగా కేదార్ జాదవ్ (22 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బ్రేవో ధైర్యంగా ఆడాడు. చివరి 3 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో రెండే వికెట్లున్నాయి. మెక్లనగన్ వేసిన 18వ ఓవర్లో బ్రేవో రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో, బుమ్రా వేసిన 19వ ఓవర్లో 3 సిక్స్‌లు సహా 20 చొప్పున పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా తిరిగి క్రీజులోకి వచ్చిన జాదవ్... ముస్తఫిజుర్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ముగించాడు. అంతకుముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. సినీ తారలు హృతిక్ రోషన్, ప్రభుదేవా, వరుణ్ ధావన్, జాక్లిన్ ఫెర్నాండెజ్, తమన్నాలు ప్రత్యేక నృత్యాలతో అలరించారు. -
ముంబై విజయలక్ష్యం 163
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లోభాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 163 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు కోహ్లి, మన్ దీప్ సింగ్‌లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే మన్ దీప్ సింగ్(17), విరాట్ కోహ్లి(20)లు ఇద్దరూ నిరాశపరిచి పెవిలియన్ కు చేరారు. బెంగళూరు 31 పరుగుల వద్ద మన్ దీప్ అవుట్ కాగా, ఆపై మరో తొమ్మిది పరుగుల వ్యవధిలో కోహ్లి వెనుదిరిగాడు. ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్(43;27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కాగా, అవతలి ఎండ్ నుంచి డివీకి పెద్దగా సహకారం లభించలేదు. స్కోరును పెంచే యత్నంలో షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు డివిలియర్స్. ఆపై పవన్ నేగీ(35;23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, కేదర్ జాదవ్(28;22 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. దాంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ మూడు వికెట్లు సాధించగా,కృణాల్ పాండ్యాకు రెండు వికెట్లు లభించాయి. కరణ్ శర్మ, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.