Sunriseers Hyderabad
-
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2023 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ధానాధాన్ లీగ్ ఆరంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రోటీస్ స్టార్ ఆటగాళ్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, రబాడ, మగాల, డికాక్, నోర్జే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడైన్ మార్క్రమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్‌కు మార్క్రమ్ దూరం కానున్నాడు. ఐపీఎల్-2023లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మార్క్రమ్ గైర్హజరీ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ సారథిగా భువీ వ్యవహరించాడు. అదే విధంగా గత కొన్ని సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక సభ్యునిగా భువీ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మెన్‌జెమెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
కోల్‌కతా దర్జాగా...
మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చావోరేవోలాంటి మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్ తర్వాత కూడా కోల్‌కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లోనే ఎలిమినేటర్‌తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్ కూడా అదే వేదికపై ఆడుతుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–11లో ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రసిధ్ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఒకే ఓవర్లో నలుగురు ఔట్... తొలి బంతికే ధావన్ కొట్టిన ఫోర్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మరోవైపు సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్ బౌలింగ్‌లో అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్‌కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్ కూడా తన ఫామ్‌ను కొనసాగించడంతో రైజర్స్ దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, ఆ తర్వాత సియర్ల్స్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్ క్యాచ్ వదిలేసిన అనంతరం ధావన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్ కలిపి హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లిన్ మెరుపులు... ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షకీబ్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్ ఔటయ్యాడు. లిన్ కూడా ధాటిగా ఆడటంతో కోల్‌కతా రన్‌రేట్ దూసుకుపోయింది. పవర్‌ప్లేలో కేకేఆర్ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్‌కతా ఇన్నింగ్స్ చకచకా సాగింది. 11 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను రషీద్ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్ బౌలింగ్‌లో కొట్టిన భారీ సిక్స్‌తో 36 బంతుల్లో లిన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్ (4), నితీశ్ రాణా(7) వెనుదిరిగినా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మిగతా పనిని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సియర్ల్స్ 36; మనీశ్ పాండే (సి) సబ్–రింకూ సింగ్ (బి) ప్రసిధ్ 25; యూసుఫ్ పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్‌వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకీబ్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ 10; రషీద్ ఖాన్ (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, ప్రసిధ్ 4–0–30–4, రసెల్ 3–0–31–1, నరైన్ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్ 4–0–35–1, సియర్ల్స్ 2–0–24–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకీబ్ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్‌వైట్ 7; గిల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, సందీప్ శర్మ 2–0–30–0, కౌల్ 4–0–26–2, షకీబ్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–31–0, బ్రాత్‌వైట్ 2.4–0–21–2. -
ధోని ధమాకా...
► రైజింగ్ పుణేను గెలిపించిన ‘మిస్టర్ కూల్’ ► 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్ ► సన్‌రైజర్స్‌కు మూడో పరాజయం ఆహా.. ఎన్నాళ్లైంది ధోని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ చూసి.. జట్టులో ఉన్నాడన్న మాటే కానీ అతను గతంలో మాదిరి ధనాధన్ ఆటను ప్రదర్శించడమే గగనమైపోయింది. అటు అభిమానులు కూడా దాదాపుగా అతడి బ్యాటింగ్ విన్యాసాన్ని పట్టించుకోవడమే మానేశారు. అయితే 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో ‘మిస్టర్ కూల్’ ధోని బ్యాట్ ఒక్కసారిగా గర్జించింది. అంచనాలకు అందని విధంగా బౌండరీల వర్షం కురిపిస్తూ ఒక్కసారిగా సమీకరణాలు మార్చేశాడు. దీంతో మ్యాచ్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్ వైపు తిరిగింది. ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచి విజయం అందించడంతో పాటు తానెప్పటికీ ‘సూపర్ ఫినిషర్’ అని ధోని నిరూపించుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ బయటి వేదికపై హ్యాట్రిక్ పరాజయం పాలైంది. ఆఖరి ఓవర్లలో బౌలర్లు తడబడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పుణే: బయటి వేదికల్లోనూ సత్తా నిరూపించుకోవాలనుకున్న డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ భంగపడింది. ఎంఎస్ ధోని (34 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడుకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఆఖరి బంతికి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి పుణే నాలుగో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఉనాద్కట్, తాహిర్, క్రిస్టియాన్లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... మనోజ్ తివారి (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం ధోనికి దక్కింది. సన్‌రైజర్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను బెంగళూరులో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. చివర్లో దూకుడు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో నత్తనడకలా సాగింది. ఆరో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొమ్మిదో ఓవర్లో ఓపెనర్ శిఖర్ ధావన్ (29 బంతుల్లో 30; 5 ఫోర్లు) అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇది ఈ సీజన్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. 12వ ఓవర్లో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) తొలి సిక్స్ బాదినా... ఆ తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. అటు వార్నర్ నెమ్మదిగా ఆడటంతో జట్టు స్కోరు వంద పరుగులు చేరేందుకు 15 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. 17వ ఓవర్లో వార్నర్‌ను ఉనాద్కట్ బౌల్డ్ చేయగా హెన్రిక్స్, దీపక్ హుడా చివర్లో ధాటిగా ఆడటంతో స్కోరు పెరిగింది. 19వ ఓవర్లో చెరో సిక్స్ బాదగా చివరి ఓవర్లో హెన్రిక్స్ వరుసగా రెండు ఫోర్లు, హుడా మరో ఫోర్ కొట్టడంతో జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరు లభించింది. వీరిద్దరి జోరుతో చివరి నాలుగు ఓవర్లలో జట్టు 54 పరుగులు సాధించగలిగింది. అలాగే నాలుగో వికెట్‌కు ఈ జోడి మధ్య అజేయంగా 47 పరుగులు జత చేరాయి. చెలరేగిన ధోని... భారీ లక్ష్యం కాకపోయినా నాలుగో ఓవర్లోనే పుణే జట్టు ఓపెనర్ రహానే (2) వికెట్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ స్మిత్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి రాహుల్ త్రిపాఠి బ్యాట్ ఝుళిపించాడు. సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా 4,6తో చెలరేగగా ఆ తర్వాత ఐదో ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో మరింత జోరు కనబరిచాడు. 32 బంతుల్లో టి20ల్లో త్రిపాఠి తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అటు పదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు సంధించిన స్మిత్‌ను మరుసటి ఓవర్లో రషీద్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు లేని పరుగు కోసం ప్రయత్నించిన త్రిపాఠిని రషీద్ నేరుగా వికెట్లకు త్రో విసిరి రనౌట్ చేయడంతో పుణేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అటు స్టోక్స్ (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో అప్పటి వరకు నిదానంగా ఆడుతున్న ధోని ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. చివరి 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 18వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అతను భువీ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా హైడ్రామా నెలకొంది. తొలి బంతిని మనోజ్ తివారి ఫోర్‌గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి ధోని, నాలుగో బంతికి తివారి ఒక్కో సింగిల్ తీశారు. ఐదో బంతి ఆడిన ధోని రెండు పరుగులు సాధించాడు. దాంతో రైజింగ్ పుణే విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతిని ధోని ఎక్స్ట్రా కవర్ దిశగా బౌండరీ దాటించి పుణేకు సూపర్ ఫినిష్ ఇచ్చి విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (బి) ఉనాద్కట్ 43; శిఖర్ ధావన్ (సి) త్రిపాఠి (బి) తాహిర్ 30; విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్ 21; హెన్రిక్స్ నాటౌట్ 55; దీపక్ హుడా నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–55, 2–84, 3–129. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–41–1; వాషింగ్టన్ సుందర్ 3–0–19–0; స్టోక్స్ 2–0–19–0; శార్దుల్ ఠాకూర్ 4–0–50–0; క్రిస్టియాన్ 4–0–20–1; తాహిర్ 3–0–23–1. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) కౌల్ (బి) బిపుల్ శర్మ 2; రాహుల్ త్రిపాఠి (రనౌట్) 59; స్మిత్ (బి) రషీద్ 27; ధోని నాటౌట్ 61; స్టోక్స్ (సి) సబ్–శంకర్ (బి) భువనేశ్వర్ 10; మనోజ్ తివారి నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–15, 2–87, 3–98, 4–121. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–39–1; బిపుల్ శర్మ 4–0–30–1; సిరాజ్ 4–0–42–0; సిద్ధార్థ్ కౌల్ 3–0–45–0; రషీద్ ఖాన్ 4–0–17–1; హెన్రిక్స్ 1–0–4–0.