super bug
-
యాంటీబయాటిక్స్ ఎలా పడితే అలా వాడొద్దు
హైదరాబాద్: కాస్త దగ్గు వస్తున్నా, గొంతులో ఇబ్బంది అనిపించినా, జ్వరం తగ్గకపోయినా చాలామంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి తమకు తెలిసిన, లేదా షాపు వాళ్లు ఇచ్చిన యాంటీ బయాటిక్స్ కొనుక్కుని వాడేస్తారు. పైగా అది కూడా పూర్తి కోర్సు కాకుండా ఒకటి లేదా రెండు రోజులు వాడి మానేస్తారు. దీనివల్ల ఇక యాంటీబయాటిక్స్ అనేవి వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగై, పరాన్న జీవుల మీద పనిచేయడం మానేస్తాయి. దీన్నే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవగాహన వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఏఎంఆర్ గురించి ప్రజలు, వైద్యులు, ప్రభుత్వ పెద్దల్లో అవగాహన పెంచి, ఏఎంఆర్ మరింత విస్తరించకుండా నియంత్రించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల నేపథ్యంలో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన మైక్రోబయలాజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు, వ్యాధులు విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. పలురకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని జీవులను మల్టీడ్రగ్ రెసిస్టెంట్ జీవులు లేదా సూపర్ బగ్స్ అంటారు. ప్రపంచంలోని టాప్10 ఆరోగ్య ముప్పుల్లో ఒకటిగా ఏఎంఆర్‌ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. 1990 నుంచి ప్రతియేటా సుమారు 10 లక్షల మంది ఏఎంఆర్ వల్ల మరణిస్తున్నారు. ఇప్పటికీ సరైన చర్యలు తీసుకుని దీన్ని నియంత్రించకపోతే ఇప్పట్నుంచి 2050 మధ్య 4 కోట్ల మంది ఇన్ఫెక్షన్లతో మరణిస్తారని గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పరిశోధనలో తేలింది. ఏఎంఆర్ వల్ల చికిత్స సమర్థత తగ్గుతుంది, రోగులు ఆస్పత్రిలో.. ఐసీయూలో ఎక్కువ కాలం ఉండాలి. వైద్యం ఖర్చు పెరిగిపోతుంది, ఒకరి నుంచి మరొకరికి మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడడమే ఏఎంఆర్‌కు ప్రధాన కారణం. వైద్యులు చెప్పకుండా తమంతట తామే మందుల దుకాణాలకు వెళ్లి ఏదో ఒక యాంటీబయాటిక్ కొని తెచ్చుకుని పూర్తికాలం వాడకపోవడం ఇకనైనా మానుకోవాలి. ఏరకం సమస్యకు ఏ యాంటీబయాటిక్ వాడాలో వైద్యులు సూచిస్తారు. వాటిని అదే మోతాదులో వాళ్లు చెప్పినన్ని రోజులు వాడాలి. దీనివల్ల భావితరాలకు ప్రాణాలు కాపాడే యాంటీబయాటిక్స్‌ను అందుబాటులో ఉంచినట్లవుతుంది. లేకపోతే అవి ఇక పనిచేయడం పూర్తిగా మానేస్తాయి. వైద్యులు రాయకపోతే మీరు డిమాండ్ చేసి మరీ యాంటీబయాటిక్స్ రాయించుకోవద్దు. మిగిలిపోతున్నాయని చెప్పినన్ని రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు వాడొద్దు. వేరేవారికి రాసిన మందులు మనం వాడడం మంచిది కాదు. దానివల్ల వ్యాధి పెరిగి, దుష్ప్రభావాలు కూడా కలగొచ్చు. ఎప్పటికప్పుడు చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతులు గానీ కర్చీఫ్ గానీ అడ్డుపెట్టుకోవాలి. ఎక్కువ మంది జలుబు, దగ్గు, జ్వరం, బ్రాంకైటిస్, ఆయాసం, గొంతునొప్పి లాంటివాటికి యాంటీబయాటిక్స్ కొనుక్కుని వాడేస్తారు.కొందరు రోగులు తమ ఆర్థిక పరిస్థితి కారణంగా పూర్తి కోర్సు వాడకుండా కొంతే తీసుకుంటారు. అలాగే ఆస్పత్రిలో కూడా పూర్తి కాలం ఉండానికి తగినంత డబ్బు లేక ముందే డిశ్చార్జి అయిపోతారు. కానీ దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్లు పూర్తిగా తగ్గకుండా.. యాంటీబయాటిక్స్ వాడినా లొంగని పరిస్థితి ఏర్పడుతుంది.జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్. దాంతోపాటు వైరస్ వల్ల వచ్చే డయేరియా కూడా దానంతట అదే తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి గానీ వైరస్ల మీద ప్రభావం చూపించవు. అందువల్ల జలుబు, డయేరియాలకు ఇవి వాడకూడదు. చాలావరకు బ్యాక్టీరియాలను టీకాలు నిరోధిస్తాయి. టీకాలు తీసుకుంటే ఇక చాలావరకు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. -
'సైంటిస్ట్‌గానే కాదు... భార్యగానూ గెలిచింది'!
ఆమె అంటువ్యాధులకు సంబంధించిన వైద్యురాలు, పరిశోధకురాలు. ఆమె భర్త అనుకోకుండా యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. తన కళ్లముందే భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి క్షణం ఓ యుగంలా భయం ముంచుకొస్తోంది. అంత పెద్ద పరిశోధకురాలు అయినా ఓ సాధారణ మహిళలా భర్త ప్రాణాల ఎలా రక్షించాలో తెలియక తల్లడిల్లిపోయింది. ఇంతవరకు అలాంటి యాంటీబయోటిక్ బ్యాక్టీరియల్ కోసం ఎలాంటి చికిత్స లేదని తెలిసి హుతాశురాలైంది. ఎలాంటి యాంటి బయాటిక్‌లు వాడిన ఫలితం ఉండదని తెలిసిన క్షణంలో ఆమె మెదడు తట్టిన మెరుపులాంటి ఆలోచనతో.. కలియుగ సావిత్రలా మారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. అందరిచేత శభాష్ అనిపించుకుంది. దాని గురించి ఓ పుస్తకం సైతం ప్రచురించింది కూడా. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఎలా భర్త ప్రాణాలు కాపాడుకుంది అంటే.. యూఎస్‌కి చెందిన స్టెఫానీ స్ట్రాత్డీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎపిడెమియాలజిస్ట్. ఆమె భర్త టామ్ ప్యాటర్సన్ సూపర్ బగ్(యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియా) ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు. సరిగ్గా 2015లో టామ్ నదిపై సర్ఫింగ్ చేస్తూ.. అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో పడిపోయాడు. తక్షణమే స్ట్రాత్ డీ ఈజిప్ట్‌లోని ఒక క్లినిక్‌కి తరలించగా, అక్కడ అతడి ఆరోగ్య మరింతగా దిగజారడం ప్రారంభమయ్యింది. దీంతో ఆమె అతడిని జర్మనీలోని ఓ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యుల యాంటీబయోటిక్స్‌కి లొంగని "బాక్టీరియం అసినెటోబాక్టర్ బౌమన్ని"తో బాధపడుతున్నట్లు తెలిపారు. అది అతడి కడుపులో ద్రాక్షపండు సైజులో ఓ గడ్డలా ఉందని చెప్పారు. అది ఎలాంటి యాంటీ బయోటిక్‌లకు లొంగదని చెప్పారు. నిజానికి ఈ బ్యాక్టీరియాని మధ్యప్రాచ్యంలోనే గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇరాక్ యుద్ధంలో చాలామంది అమెరికన్ దళాల గాయపడ్డారు. అయితే వారంతా ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లాక ఈ బ్యాక్టీరియా బారిన పడే చనిపోయినట్లు నిర్థారించారు. అప్పుడే ఈ బ్యాక్టీరియాకు ఇరాకీ బాక్టీరియాగా నామకరణం చేశారు. దీనికి ఆధునిక వైద్యంలో సరైన చికత్స లేదు. ఇప్పటికీ ఈ బ్యాక్టీరియాని అంతం చేసేలా పరిశోధనలు జరుగుతున్న దశలోనే ఉన్నాయి. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా జరగలేదు. దీంతో స్ట్రాత్ డీ డీలా పడిపోయింది. కళ్ల ముందు మృత్యు ఒడిలోకి జారిపోతున్న భర్త, ఏం చేయాలేని స్థితిలో తాను ఏంటీ స్థితి అని పరివిధాలుగా ఆలోచించింది. ఈ క్రమంలో ఎందరో పరిశోధకులను సంప్రదించింది. దీనికి సంబంధించిన సమాచారాన్నంత క్షుణ్ణంగా పరిశీలించింది. దేనికి లొంగని ఈ యాంటీ బ్యాక్టీరియాలను తినేసే ఫేజ్ వైరస్‌లే(పరాన్నజీవులు) శరణ్యమని అర్థమయ్యింది. ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బ్యాక్టీరియాలని కూడా చెప్పొచ్చు. ఇవి మురికి నీటిలోను, చెరువులు, పడవల్లో, సముద్రాల్లో ఉంటాయని గుర్తించింది. అయితే వాటిలో ఏది తన భర్తకు వచ్చిన బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ను తినేయగలదో అంచనావేసి, ఆ ఫేజ్ వైరస్‌ని శుద్ధి చేసి రక్తంలోకి ఇంజెక్ట్ చేయాలి. అయితే ఇంతవరకు ఈ ఫేజ్ థెరఫీని ఏ పేషెంట్‌కి ఇవ్వలేదు. ఎందుకంటే దీనిపై పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సాహసం చేయకు తప్పదు స్ట్రాత్ డీకి. అందుకోసం ముందుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో పాటు ఈ ట్రీట్మెంట్ చేసేందుకు పరిశోధకులు కూడా స్వచ్ఛందంగా ముందుకురారు ఎందుకంటే? ఈ టీట్మెంట్ పేషెంట్ ప్రాణాలతో చెలాగాటమనే చెప్పాలి. చివరకు టెక్సాస్ యూనివర్శిటీ బయోకెమిస్ట్ రైలాండ్ యంగ్ అనే పరిశోధకుడు మాత్రమే ముందుకొచ్చారు. ఆయన గత 45 ఏళ్లుగా ఈ ఫేజ్లపైనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెక్సాస్ యూనివర్సిటీ ల్యాబ్ స్ట్రాత్ డీ భర్త టామ్‌కి సరిపడా ఫేజ్ కోసం ఆహర్నిశలు యత్నించి టామ్ శరీరంలోని బ్యాక్టీరియాతో క్రియాశీలకంగా పనిచేసే ఫేజ్ వైరస్‌ని కనుగొన్నారు. ముందుగా అతడి పొత్తికడుపులో చీముతో నిండిన గడ్డలోని ఈ ఫేస్‌ని ఇంజెక్ట్ చేశారు. ఏం జరగుతుందో తెలియని ఉత్కంఠతో ప్రతి రెండు గంటలకు చికిత్సు కొనసాగిస్తూ పరిశోధక బృందమంతా అతడిని పర్యవేక్షించారు. ఆ తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలను వ్యాపించిన బ్యాక్టీరియాను నివారించటం కోసం ఆ ఫేజ్లను టామ్ రక్తంలోకి ఇంజెక్ట్ చేశారు. నెమ్మదిగా టామ్ కోలుకోవడం కనిపించింది. దీంతో పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తూ..ఇలా యూఎస్‌లో సిస్టమిక్ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి ఇంట్రావీనస్ ఫేజ్ థెరపీని పొందిన తొలి వ్యక్తి టామ్ అని చెప్పారు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కోమాలోకి వెళ్లిన టామ్ కాస్త బయటకు రావడమే కాకుండా తన కూతురిని గుర్తుపట్టి ఆమె చేతిని ముద్దాడాడు. దీని నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డాకు దీర్ఘాకాలిక వ్యాధులైన డయాబెటిస్ వంటి రోగాల బారిన పడ్డాడు. ఆహార సంబంధ జీర్ణశయ సమస్యలను కూడా ఫేస్ చేశాడు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో కరోనా బారిన పడి శ్వాస సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నింటిని విజయవంతంగా జయించి కోలుకున్నాడు. ఇప్పుడూ తన భార్య స్ట్రాత్ డీతో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చే పర్యటనలు కూడా చేస్తున్నాడు. ఒకరకంగా టామ్‌కి ఇచ్చిన ఫేజ్ థెరఫీ కొత్త శాస్త్రీయ ఆలోచనకు నాందిపలికింది. ఇక స్ట్రాత్ డీ తన భర్త ప్రాణాల కోసం సాగించిన అలుపెరగని పోరాటాన్ని “ది పర్ఫెక్ట్ ప్రిడేటర్: ఎ సైంటిస్ట్ రేస్ టు సేవ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ ఎ డెడ్లీ సూపర్‌బగ్” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించి మరీ ఈ బ్యాక్టీరియా పట్ల అవగాహన కల్పిస్తోంది. తనలా ధైర్యంగా ఉండి తమవాళ్లను ఎలా కాపాడుకోవాలో ఈ పుస్తకం ద్వారా ప్రచారం చేస్తోంది కూడా. కాగా, అయితే యాంటీబయటిక్లను ఈ ఫేజ్‌లు భర్తీ చేయవు కానీ యాంటీబయోటిక్‌లకు లొంగని బ్యాక్టీరియాలకు(సూపర్ బగ్‌లు) ఈ ఫేజ్‌లు మంచి ప్రత్యామ్నాయమైనవి, సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. నటుడు కృష్ణంరాజు సైతం.. అంతేగాదు 2050 నాటికి ప్రతి మూడు సెకన్లకు ఒకరు చొప్పున ఏడాదికి 10 మిలియన్ల మంది దాక ప్రజలు ఈ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్తో మరణిస్తారని యూస్ లైఫ్ సైన్స్ అంచనా వేసింది. అంతేగాదు దివంగత సినీనటుడు కృష్ణంరాజు మృతికి కారణం పేర్కొంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ప్రస్తావన ఉండటం గమనార్హం. ఇది ఎక్కువగా సుదీర్ఘ కాలం ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారికే వస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. దీన్ని నెగిటివ్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. భారత్‌లో కూడా దీని తాలుకా కేసులు పెరుగుతుండటంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. (చదవండి: 41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె ఎవరనేది గుర్తించి కూతురికి అందజేస్తే..!) -
సూపర్‌బగ్ 'బయో'త్పాతం
- విచ్చలవిడి వినియోగంతో నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా - తెలంగాణ, ఏపీల్లోని బ్యాక్టీరియాలో 20% సూపర్‌బగ్ ఉన్నట్లు అంచనా - సాధారణ జ్వరాలు, రుగ్మతలతోనే ప్రాణాపాయ స్థితి - సూపర్‌బగ్స్‌తో దేశంలో ఏటా 10 లక్షల మంది మృత్యువాత! - అందులో తెలుగు రాష్ట్రాల్లోనే లక్ష మంది - ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తుతోందంటున్న వైద్య నిపుణులు - పంటల్లో పురుగు మందులుగా యాంటీ బయోటిక్స్‌తోనూ ప్రమాదం - మందుల దుకాణాల్లోనూ నిర్లక్ష్యంగా అమ్మకాలు - ప్రభుత్వ నియంత్రణ శూన్యం.. - ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా మారని తీరు రమేశ్‌కు జ్వరం వచ్చింది.. మందుల దుకాణానికి వెళ్లి మాత్రలు కొనుక్కుని వేసుకున్నాడు.. మూడు రోజులైనా తగ్గలేదు.. ఓ క్లినిక్‌కు వెళ్లాడు.. డాక్టర్ మరో రెండు మాత్రలు, యాంటీ బయోటిక్ రాసిచ్చాడు.. అయినా తగ్గలేదు.. పరిస్థితి విషమించింది. పెద్దాస్పత్రికి తీసుకెళితే ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సి వచ్చింది. వచ్చింది జ్వరమే. కానీ రమేశ్‌కు సోకింది మాత్రం.. ‘సూపర్‌బగ్’. యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా. ఇవి సంక్రమిస్తే మందులేవీ పనిచేయవు. తెలంగాణ, ఏపీల్లోని బ్యాక్టీరియాలో సూపర్‌బగ్స్ 20 శాతం వరకూ ఉన్నాయని.. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఏటా లక్ష మంది వరకూ మరణిస్తున్నారని వైద్యుల అంచనా. సూపర్‌బగ్స్ తయారుకావడానికి ప్రధాన కారణం.. యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటమే.. సాక్షి, హైదరాబాద్: కొన్ని దశాబ్దాలకు ముందు ఎవరికైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితు లు ఉండేవి. 1928లో యాంటీ బయోటిక్స్‌ను కనిపెట్టాక ఇన్ఫెక్షన్లకు విరుగుడు లభించింది. వాటితో బ్యాక్టీరియాకు చెక్ పెట్టడం ద్వారా ఎన్నో మొండి వ్యాధులకు కళ్లెం వేయగలిగాం. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అనేక బ్యాక్టీరియాలు యాంటీ బయోటిక్స్‌ను ఎదిరించే ‘సూపర్‌బగ్’స్థితికి రూపాంతరం చెం దాయి. దీంతో సాధారణ రోగాలు కూడా ఔష ధాలకు లొంగకుండా మొండిగా తయారయ్యా యి. ఏదైనా బ్యాక్టీరియా యాంటీ బయోటిక్స్ కు లొంగకపోతే దానినే సూపర్‌బగ్ అంటారు. ఇప్పటికే మూడు రకాలు.. సూపర్‌బగ్స్‌గా మారిన బ్యాక్టీరియాలు దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. తెలంగాణ లోనూ సూపర్‌బగ్స్ 20 శాతం వరకు విస్తరించి ఉన్నాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నా రు. రాష్ట్రంలో ‘మెతిసిలిన్ రెసిస్టెంట్ సెఫిలో కాకస్ ఆర్స్ (ఎంఆర్ఎస్ఏ), డయాబె టిస్, ఊపిరితిత్తులు, రక్తంలో ఇన్ఫెక్షన్కు కారణమ య్యే క్లెప్సియెల్లా; గనేరియాకు కారణమయ్యే నిస్సీరియా; టీబీకి కారణమ య్యే మైకో బ్యాక్టీరియాలు సూపర్బగ్లా మారాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి గురైన వారు కూడా సూపర్‌బగ్స్ కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. అటువంటివారిని ఐసీయూల్లో, వెంటిలేటర్‌పై పెట్టాల్సిన పరిస్థితులూ ఉంటున్నాయని చెబుతున్నారు. ఆయా సూపర్‌బగ్‌లు సోకిన వారికి చికిత్స చేస్తే కోలుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని, ఇది ఆరోగ్య సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం అమెరికాలో ఏటా 23 వేల మంది సూపర్‌బగ్ బ్యాక్టీరియా కారణంగా చనిపోతున్నారని అక్క డి సర్వేలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందు తున్న దేశాల్లో ఈ సంఖ్య మరింతగా ఎక్కువగా ఉంది. భారతదేశంలోనూ సూపర్‌బగ్ కారణం గా అనేక రోగాలు తిరగబడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఏటా దేశంలో సూపర్‌బగ్ బ్యాక్టీరియాల కారణంగా సాధారణ జబ్బులు కూడా నయం కాకపోవడంతో దాదాపు 10 లక్షల మంది వరకు చనిపోతున్నారని అంచనా. అందులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారే దాదాపు లక్ష మంది వరకు ఉంటారని నిపుణులు లెక్కగడుతున్నారు. ప్రపంచ సగటు న యాంటీ బయోటిక్స్ వాడకం 36% ఉంటే.. భారత్‌లో 62%గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అది ఏకంగా 69 % వరకు ఉన్నట్లు అంచ నా. దేశంలో సూపర్‌బగ్ అధికం గా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ తర్వాత తెలంగాణ, ఏపీలు ఉన్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా.. చీటికి మాటికి యాంటీ బయోటిక్స్ వాడకూ డదని, దానివల్ల బ్యాక్టీరియా దేనికీ లొంగని స్థితికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. యూరప్ దేశాలు, కెనడా, అమెరికాల్లో యాంటీ బయోటిక్స్ వాడకం ఇటీవల తగ్గుతుండగా... ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో పెరుగుతుం దని ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఒక యాంటీ బయోటిక్‌ను కనుగొనాలంటే కనీసం ఐదారేళ్లు పడుతుంది. కానీ విచ్చలవిడి యాం టీ బయోటిక్స్ వినియోగం కారణంగా బ్యాక్టీరి యాలు కొద్దికాలంలోనే వాటికి నిరోధకతను పెంచుకుని సూపర్‌బగ్‌లుగా మారుతున్నాయి. ఈ సూపర్‌బగ్‌లను నిర్మూలించే ఔషధాల తయారీకి మళ్లీ ఎన్నో ఏళ్లుపడుతుంది. దీంతో మొత్తంగా ఆరోగ్య రంగానికే సవాలు ఎదురవు తోంది. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు సాధారణ జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చిన వారికి కూడా ఐసీయూలకు పంపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరికి వెంటిలేటర్లు కూడా పెట్టాల్సి వస్తోంది. వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీల్లోనూ.. వ్యవసాయ పంటల్లోనూ తెగుళ్లను నిర్మూలించేందుకు పురుగు మందులు వేస్తారు. వాటిల్లోనూ ఇటీవల యాంటీ బయోటిక్స్‌ను వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇక పాలిచ్చే గేదెలు, ఆవులు, కోళ్లు తదితర వాటికి కూడా యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. ఈ పరిస్థితి కూడా సూపర్‌బగ్‌లకు కారణమవుతోంది. అసలు నియంత్రణేదీ? అమెరికాలో ఒక యాంటీ బయోటిక్ వాడాలంటే... ముందు ఆ అనారోగ్యానికి యాంటీ బయోటిక్ అవసరమని వైద్యులు నిర్ధారించాలి. దానికి ప్రిస్కిప్షన్ రాసివ్వాలి. సంబంధిత ఆసుపత్రి అనుమతి ఇవ్వాలి. అప్పుడే కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వైద్యులు ఇష్టారాజ్యంగా యాంటీ బయోటిక్స్‌ను సూచించరు, మందుల దుకాణాలకు వెళ్లి నేరుగా యాంటీ బయోటిక్ మందులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. కానీ మన దేశంలో ఎలాంటి నియంత్రణా లేదు. వైద్యులు సాధారణ జలుబు, జ్వరానికి కూడా యాంటీ బయోటిక్స్ రాసిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్ఎంపీలు, మందుల దుకాణదారులు కూడా నేరుగా విక్రయిస్తున్నారు. కొందరు వైద్యులు రోగుల మానసిక స్థితిని బట్టి త్వరగా ఉపశమనం కలగాలనే ఉద్దేశంతో యాంటీ బయోటిక్స్ రాసిస్తున్నారు. అసలు మన దేశంలోని 95 శాతం ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ డిసీజ్ కమిటీలు లేనే లేవు. పర్యవేక్షణ అంతంతే. వైరల్ జ్వరాలకు అసలు యాంటీ బయోటిక్స్ వాడకూడదు. ఒకవేళ వాడినా నిర్ణీత డోసుల్లో వాడాలి. మొత్తంగా ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, యాంటీ బయోటిక్స్ వినియోగంపై నియంత్రణ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. "యాంటీ బయోటిక్స్ ఇష్టారాజ్యంగా ఉప యోగించడం వల్లే సూపర్‌బగ్‌లు తయార వుతున్నాయి. పిల్లలకు ఇష్టాను సారంగా యాంటీబయోటిక్స్ ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలకు యాంటీ బయోటిక్స్ ఇవ్వకూడదు. మందుల కంపెనీల ధనదాహం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు.." -డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం "అధికంగా యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల రోగాలు మొండిగా మారుతున్నాయి. సూపర్‌బగ్స్ కారణంగా ఏ యాంటీ బయోటిక్ కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. సాధారణ జబ్బులకూ ఐసీయూ, వెంటిలేటర్లను ఉపయోగించాల్సిన పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో 10 నుంచి 20 శాతం వరకు సూపర్‌బగ్ ఆవరించి ఉందని అంచనా.." - డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, కాంటినెంటల్ ఆసుపత్రి, హైదరాబాద్ "యాంటీ బయోటిక్స్ వినియోగంపై మన దేశంలో నియంత్రణ లేదు. దీంతో విచ్చలవిడిగా వాడకం జరుగుతోంది. అమెరికాలో కచ్చితమైన నియంత్రణ వ్యవస్థ ఉంది. అయితే మన వద్ద సూపర్‌బగ్ ఉందని, ఇండియాకు వెళితే సూపర్‌బగ్ వస్తుందని పాశ్చాత్య దేశాలు భయపెడుతున్నాయి. కానీ ఆ దేశాల్లోనూ సూపర్‌బగ్ ఉంది.." - డాక్టర్ టి.గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
అమెరికా ఆస్పత్రిలో ‘సూపర్‌బగ్’
హాలీవుడ్ సెలబ్రిటీల చికిత్సకు పేరుపొందిన సెడార్-సినాయ్ మెడికల్ సెంటర్లో చికిత్సకు లొంగని ‘సూపర్‌బగ్’ పట్ల గురువారం నాడు అప్రమత్తత ప్రకటించారు. వైద్య పరిభాషలో ‘కార్బాపీనెమ్-రెసిస్టెంట్ ఎంటరోబ్యాక్టీరియాసియా బ్యాక్టీరియా (సీఆర్ఈ)గా వ్యవహరించే ఈ సూపర్‌బగ్ నలుగురు రోగులకు సోకినట్టు నిర్ధారించామని ఆస్ప్రత్రి వర్గాలు తెలిపాయి. మరో 70 మందికి సోకే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలే తెలియజేస్తున్నాయి. గత నెలలోనే నగరంలోని రొనాల్డ్ రీగన్ ఉక్టా మెడికల్ సెంటర్లో ఇదే సూపర్బగ్తో వచ్చే వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. క్లోమగ్రంధి, పైత్యరస నాళం జబ్బుల శస్త్ర చికిత్సకు ఉపయోగించే వైద్య పరికరాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని తేలడంతో రోనాల్డ్ రీగన్ మెడికల్ సెంటర్‌పై గగ్గోలు రేగింది. సూపర్‌బగ్ వ్యాప్తికి కారణమవుతున్న వైద్య పరికరాలతో తమ ఆస్ప్రత్రిలో దాదాపు 70 మందికి చికిత్సలు చేశామని ఇప్పుడు వారందరినీ వెనక్కి పిలిపించి పరీక్షలు నిర్వహించనున్నామని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.