super-Earth
-
మరో సూర్ ఎర్త్!
లండన్: ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా సూర్యుడికి పొరుగునే మరో గ్రహాన్ని (సూపర్ ఎర్త్) కనుగొన్నారు. ఇది నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ ఈ సూపర్ ఎర్త్ తిరుగుతున్నట్లు గుర్తించారు. బ్రిటన్‌లోని క్వీన్ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. భూమికి కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమికన్నా మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్ చుట్టూ పరిభ్రమించడానికి దీనికి 233 రోజులు పడుతుందని అంచనా వేశారు. రాళ్లు, మంచుతో కూడిన ఈ గ్రహంపై నీటి వనరులు పుష్కలమని, కానీ, కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త గుల్లెమ్ అంగ్లడ ఎస్కుడే పేర్కొన్నారు. కనుగొనడానకి ముందు శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి సంబంధించి 20 ఏళ్లుగా చేస్తున్న సర్వేలు, పరిశోధనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తొలిసారి రేడియల్ వెలాసిటీ పద్ధతి సాయంతో ఈ గ్రహాన్ని గుర్తించారు. -
మరో భూమి.. మనకు దగ్గరలో!?
భూమిని పోలిన మరో గ్రహం ఉందా? అక్కడ జీవరాశి మనుగడ సాధ్యమేనా? మన భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? అక్కడకు మనం వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు అవునని.. సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. ఒట్టావా : భూమిని పోలిన మరో గ్రహాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉందని సైంటిస్టులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన ఈ గ్రహానికి కె2-18బీ అని సైంటిస్టులు నామకరణం చేశారు. భూమిని పోలిన ఈ గ్రహాన్ని కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో పరిశోధకులు సంయుక్తంగా గుర్తించారు. తాజాగా గుర్తించిన ఈ గ్రహంపై మంచుతో కూడిన రాళ్లు, పర్వతాలతో ఉందని ఉంటుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన రేయాన్ క్లుటీర్ తెలిపారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ఈఎస్ఓ) డేటాను విశ్లేషించే క్రమంలో ఈ గ్రహం గురించిన సమాచారం తెలిసిందని ఆయన తెలిపారు. కే2-18బీ గ్రహం ఇంచుమించుగా నెఫ్ట్యూన్ గ్రహాన్ని పోలి ఉంటుందని రేయాన్ చెప్పారు. ద్రవ్యరాశి గురించిన సమాచారం లేదన్న ఆయన.. సూర్యుడి (అక్కడి పాలపుంతలో ఉండే నక్షత్రం) చుట్టూ తిరిగేందుకు 32.9 రోజుల సమయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ గ్రహం గురించి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్
* భూమికి 180 కాంతి సంవత్సరాల దూరంలో హెచ్ఐపీ 116454బీ వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన కెప్లర్ అంతరిక్ష నౌక కొత్త మిషన్‌లో ఓ సూపర్ ఎర్త్‌ను గుర్తించింది. ఈ సూపర్ ఎర్త్ భూమికి సుమారు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహాన్ని హెచ్ఐపీ 116454బీగా పిలుస్తున్నారు. దీని వ్యాసార్థం భూమికంటే రెండున్నర రెట్లు ఎక్కువ కాగా.. బరువు భూమికంటే 12 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రకమైన గ్రహం మన సౌర వ్యవస్థలో లేదని పేర్కొం టున్నారు. కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్న ఆండ్రూ వెండర్‌బెర్గ్ కే2 మిషన్‌కు సంబంధించిన డేటాను సేకరించి ఈ సూపర్ ఎర్త్‌ను గుర్తించాడు. హెచ్ఐపీ 116454బీ ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని, దీని పరిభ్రమణానికి తొమ్మిది రోజుల సమయం పడుతోందని పేర్కొన్నాడు. అయితే ఈ నక్షత్రం సూర్యుని కంటే చిన్నగా.. చల్లగా ఉందని, వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ జీవులు బతకడం కష్టమని తెలిపారు. కానరీ ద్వీపంలోని టెలిస్కోపియో నజియోనలె గెలీలియోలోని హార్ప్స్ నార్త్ స్పెక్ట్రాగ్రాఫ్ సాయంతో ఈ సూపర్ ఎర్త్ కొలతలను నిర్ధారించారు. ఈ ఏడాది మేలో ప్రారంభమైన కే2 మిషన్‌లో ఇప్పటి వరకూ 35 వేల నక్షత్రాలను పరిశీలించారు. అలాగే నక్షత్ర సమూహాలు, నక్షత్రాలు సృష్టించబడే ప్రాంతాలు, మన సౌర వ్యవస్థలోని అనేక గ్రహ శకలాలను కూడా పరిశీలించారు.