సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్ | NASA's Kepler mission discovers 'super-Earth' | Sakshi
Sakshi News home page

సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్

Published Sat, Dec 20 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్

సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్

* భూమికి 180 కాంతి సంవత్సరాల దూరంలో హెచ్‌ఐపీ 116454బీ

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన కెప్లర్ అంతరిక్ష నౌక కొత్త మిషన్‌లో ఓ సూపర్ ఎర్త్‌ను గుర్తించింది. ఈ సూపర్ ఎర్త్ భూమికి సుమారు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహాన్ని హెచ్‌ఐపీ 116454బీగా పిలుస్తున్నారు. దీని వ్యాసార్థం భూమికంటే రెండున్నర రెట్లు ఎక్కువ కాగా.. బరువు భూమికంటే 12 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రకమైన గ్రహం మన సౌర వ్యవస్థలో లేదని పేర్కొం టున్నారు.

కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్న ఆండ్రూ వెండర్‌బెర్గ్ కే2 మిషన్‌కు సంబంధించిన డేటాను సేకరించి ఈ సూపర్ ఎర్త్‌ను గుర్తించాడు. హెచ్‌ఐపీ 116454బీ ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని, దీని పరిభ్రమణానికి తొమ్మిది రోజుల సమయం పడుతోందని పేర్కొన్నాడు. అయితే ఈ నక్షత్రం సూర్యుని కంటే చిన్నగా.. చల్లగా ఉందని, వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ జీవులు బతకడం కష్టమని తెలిపారు.

కానరీ ద్వీపంలోని టెలిస్కోపియో నజియోనలె గెలీలియోలోని హార్ప్స్ నార్త్ స్పెక్ట్రాగ్రాఫ్ సాయంతో ఈ సూపర్ ఎర్త్ కొలతలను నిర్ధారించారు. ఈ ఏడాది మేలో ప్రారంభమైన కే2 మిషన్‌లో ఇప్పటి వరకూ 35 వేల నక్షత్రాలను పరిశీలించారు. అలాగే నక్షత్ర సమూహాలు, నక్షత్రాలు సృష్టించబడే ప్రాంతాలు, మన సౌర వ్యవస్థలోని అనేక గ్రహ శకలాలను కూడా పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement