సర్వేకు 2వేల వాహనాలు
మహబూబ్నగర్ క్రైం: మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర కు టుంబ సర్వేకు ఆర్టీఏ తరఫున అన్ని చర్య లు తీసుకున్నట్లు ఆర్టీఓ కిష్టయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు వేల వాహనాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సోమవారం జి ల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో సర్వే కోసం వినియోగిస్తున్న వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రతి డ్రైవరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించకూడదన్నారు. విధులకు హాజరవుతున్న డ్రైవర్లు తమకు కేటాయించిన ప్రాంతానికి సరైన సమయంలో చేరుకోవాలని సూచించారు. సర్వేలో పాల్గొంటున్న స్పెషల్ ఆఫీసర్, జోనల్ ఆధికారులు,
మండల కోఆర్డినేటర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు ఈ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. గద్వాల, షాద్నగర్, కల్వకుర్తి, పెబ్బేరు, మహబూబ్నగర్ నియోజకవర్గాల వారీగా ఓ ఎంవీఐ అధికారిని నియమించి ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాహనాలను సమకూర్చినట్లు వెల్లడించారు. సూదర గ్రామాలకు వెళ్లే సంబంధిత అధికారులు వారికి కేటాయించిన వాహనాల సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుభవం కలిగిన డ్రైవర్ల సేవలు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కండి షన్లో ఉన్న వాహనాలను మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాలు ఎక్కడైన మరమ్మతులకు గురైతే వెంటనే మరో వాహనాన్ని పంపించే ఏర్పాట్లుచేశామని ఆర్టీఓ స్పష్టంచేశారు.