సూపర్ ఓవర్లో ముంబై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గుజరాత్ లయన్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా తొలుత బ్యాటింగ్ కు మొగ్గు చూపాడు. బ్యాటింగ్‌కు దిగిన రైనా సేన 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ముంబై ఓపెనర్లలో పార్ధీవ్ పటేల్ (70, 44 బంతుల్లో, ఒక సిక్సు, 9 ఫోర్లు) విహారం చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్సాట్స్మన్లు గుజరాత్ బౌలర్లకు దాసోహం అయ్యారు. మరో వైపు వికెట్లు పడుతున్నా ముంబై ప్లేయర్ కృణాల్(29 పరుగులు, 20 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశాడు.
ఒక బంతికి ఒక పరుగు కావాల్సిన సమయంలో బంతి బ్యాట్స్‌మన్ మలింగ కాలుకు తగిలి జడేజా చేతిలో పడింది. రన్ తీయడానికి బ్యాట్స్‌మన్ ప్రయత్నించడంతో జడేజా డైరెక్ట్ హిట్‌తో కృణాల్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. నిర్ణీత సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై 11 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ ఆరు పరుగులే చేయడంతో ముంబై విజయం సాధించింది.