ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూను బలపర్చాలి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్
నారాయణఖేడ్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ అన్నారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో ఆవరణలో టీఎంయూ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఎన్నికల్లో కార్మికులు టీఎంయూను బలపర్చాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు టీఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారని, టీఎంయూను గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
సమావేశంలో ఆర్టీసీ రీజియనల్ కార్యదర్శి పి.శ్రీనివాస్‌రెడ్డి, బాబర్ మియా, డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ రెడ్డి, నెహ్రూ, అజీం, మహీంద్రా యూనియన్ టీఎంఎస్ అధ్యక్షుడు మదన్మోహన్, సర్పంచ్ అప్పారావు షెట్కార్, గొర్రెలకాపరుల సహకార సంఘం జిల్లా చైర్మన్ మల్శెట్టి యాదవ్, జెడ్పీటీసీలు నిరంజన్, రవి, టీఆర్ఎస్ నాయకులు పండరి యాదవ్, మూఢ రామకృష్ణ, పురంజన్, బాసిత్, వెంకట్‌నాయక్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.