మా మధ్య విభేదాలు లేవు
ముంబై : బీజేపీ ప్రభుత్వానికి మద్దతు విషయంలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే స్పష్టం చేశారు. గురువారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పార్టీ వైఖరిపై తనకు పరిమితులున్నాయనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.
అయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంపై తమ పార్టీ నాయకుడు జయంత్‌పాటిల్ ఇటీవల అలీబాగ్‌లో జరిగిన సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం వాస్తవమేనన్నారు. వాస్తవానికి భావి కార్యాచరణపై చర్చిం చేందుకే అక్కడ సమావేశాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలనే అంశంపై ఆ సమావేశంలో చర్చించామన్నారు.