మా మధ్య విభేదాలు లేవు | No differences in NCP over support to BJP government: Supriya Sule | Sakshi
Sakshi News home page

మా మధ్య విభేదాలు లేవు

Published Thu, Nov 20 2014 11:01 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

మా మధ్య విభేదాలు లేవు - Sakshi

మా మధ్య విభేదాలు లేవు

ముంబై : బీజేపీ ప్రభుత్వానికి మద్దతు విషయంలో తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే స్పష్టం చేశారు. గురువారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పార్టీ వైఖరిపై తనకు పరిమితులున్నాయనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

అయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంపై తమ పార్టీ నాయకుడు జయంత్‌పాటిల్ ఇటీవల అలీబాగ్‌లో జరిగిన సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం వాస్తవమేనన్నారు. వాస్తవానికి భావి కార్యాచరణపై చర్చిం చేందుకే అక్కడ సమావేశాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలనే అంశంపై ఆ సమావేశంలో చర్చించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement