support to farmers
-
పొన్నూరులో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సీపీ పోస్టర్ రిలీజ్
-
గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు!
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్లు చేసిన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గ్రెట్గా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేస్తూ మరో ట్వీట్ చేశారు. బెదిరింపులు, కేసులు తన వైఖరిని మార్చలేవని తేల్చిచెప్పారు. భారత్‌లో రైతన్నల ఆందోళనలు, నిరసనలపై రెండు రోజుల క్రితం థన్‌బర్గ్ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ఆమెను తప్పుపడుతూ భారత్‌లో పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికారు. థన్‌బర్గ్ ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు వీటిపై దర్యాప్తు ప్రారంభించారు. థన్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. ‘థన్‌బర్గ్‌కు సాహస బాలిక అవార్డివ్వాలి’ గ్రెటా థన్‌బర్గ్‌కు భారత ప్రభుత్వం సాహస బాలిక పురస్కారం ప్రదానం చేయాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ గురువారం పేర్కొన్నారు. దేశాన్ని అస్తిరపర్చేందుకు జరుగుతున్న కుట్రకు సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు గ్రెటా థన్‌బర్గ్‌కు ఈ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు పేరిట భారతదేశాన్ని అస్తిరపర్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి విదేశీ సర్టిఫికెట్ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని అన్నారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విదేశీ శక్తులకు పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఆమోదించిన చట్టం విషయంలో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ నేత అమిత్ మాలవియా ప్రశ్నించారు. -
రైతుల వాదనకే మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఏ కమిటీలోనూ సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అధ్యయనం చేయడంతో పాటు, వారిని ఆందోళనల నుంచి విరమింపచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ కమిటీలో ఉండే సభ్యుల పేర్లలో తన పేరును సుప్రీంకోర్టు ప్రస్తావించడంపై సాయినాథ్ స్పందించారు. కమిటీ సభ్యుడిగా తన పేరు రావడంపై ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సంప్రదిస్తే.. కమిటీ ఏర్పాటు హేతుబద్ధతపై ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలుసుకుంటాను. కమిటీ ఉద్దేశం, లక్ష్యాలేమిటో కనుక్కుంటాను. కమిటీ ప్రాతినిధ్యం వివరాలు, ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేదీ లేనిదీ కనుక్కుంటాను’ అని వివరించారు. రైతులు వెలిబుచ్చిన 14, 15 అభ్యంతరాల్లో 12 అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందంటేనే, చట్టాల్లో తీవ్ర లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు. రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతిస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రకటించింది. ఏఐకేఎస్ నాయకులు అజిత్ నవాలే, అశోక్ ధవాలే, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నేతలు డీఎం దరార్, సునీల్ మాలుసరె మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రకటన చేశారు. ‘రైతుల కష్టంతో కార్పొరేట్లు లాభాలు ఆర్జించేందుకే ఈ చట్టాలు ఉపయోగపడ్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులతో కలిసి డిసెంబర్ 21న ఢిల్లీకి బయల్దేరుతాం’ అని వెల్లడించారు. -
ప్రత్యామ్నాయంతో రైతుకు భరోసా
– వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.హరిజవహర్‌లాల్ వెల్లడి అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగుకు అదను మీరిపోవడంతో ఇక ప్రత్యామ్నాయంతో రైతులకు భరోసా కల్పించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వ్యవసాయశాఖ జేడీఏలు, డీడీఏలు, డాట్ సెంటర్, కేవీకే, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు సమావేశమై ఖరీఫ్ పంటల సాగు, వాటి స్థితిగతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌తో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్వీ నాయుడు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అధిపతి డాక్టర్ బి.గోపాలరెడ్డి, హైదరాబాద్ మెట్ట పరిశోధనా కేంద్రం(క్రీడా) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కేవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్‌లో పంటలు సాగులోకి రాలేదన్నారు. 13 జిల్లాల పరిధిలో సాధారణ సాగు లక్ష్యం 42 లక్షల హెక్టార్లు కాగా.. ప్రస్తుతానికి 14.07 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయన్నారు. వర్షాధార ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల హెక్టార్లలోపు పంటలు మాత్రమే సాగులోకి వచ్చాయన్నారు. కొన్ని జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. రాయలసీమ జిల్లాలు బాగా వెనుకబడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతాలు, జిల్లాల వారీగా నేలలు, రకాలు, వాతావరణం, వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ సంవత్సరం 20.44 లక్షల మంది రైతులకు భూసార పత్రాలు పంపిణీ చేయగా, అందులో సిఫారసుల మేరకు ఉచితంగా సూక్ష్మపోషకాలు అందజేస్తున్నామని తెలిపారు. వారంలోగా అన్ని జిల్లాలలో ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. -
పోర్టుకు ఆనాడు 2వేల ఎకరాలు చాలన్నారే
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్): ప్రభుత్వానికి భూములిచ్చేది లేదని తేల్చి చెప్పండంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపునిచ్చారు. గురువారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో 17 రోజులుగా కొండ పోరంబోక సాగుదారులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. 70ఏళ్ళ నుంచి రైతులు సాగుచేస్తున్న భూములలో సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సిపి పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. అనంతరం పశువుల ఆస్పత్రి వద్ద జరుగుతున్న దీక్షా శిబిరంలో సాగుదారులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 4.11 లక్షల ఎకరాల భూములు సాగుదారుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బలవంతంగా సెంటు భూమి కూడా ఇవ్వబోమని రైతాంగం పోరాటం చేయాలన్నారు. చట్టాలను పక్కనబెట్టి భూసేకరణకు పాల్పడితే సహించేది లేదని మధు హెచ్చరించారు. 2004లో భూములు ఇచ్చిన రైతులు కూలీలుగా మిగిలిపోయారని చెప్పారు. బందరు పోర్టుకు 5,500 ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇస్తే అప్పట్లో 2 వేలు ఎకరాలు చాలని నానా యాగీ చేసిన టీడీపీ ఈ రోజు 33వేల ఎకరాలు రైతుల వద్ద ఎందుకు సేకరించాలని చూస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలోని భూములు కోల్పోయే రైతులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి డిసెంబరులో చలో విజయవాడ చేపడతామని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారమే చేయాలి భూసేకరణ చట్టం రూపకల్పన సమయంలో రైతాంగానికి మేలు చేయాలని చెప్పిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని విస్మరించటం సరికాదన్నారు. భూముల పేరుతో ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేయడానికి భూములు తీసుకుంటున్నారని, ఒంగోలులో వాన్‌పిక్, అనంతపురంలో లేపాక్షీ భూముల బాగోతాలు నిదర్శనాలని మధు చెప్పారు. తూర్పు గోదావరి తొండంగిలో రైతుల పై లాఠీఛార్జి చేసి భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకుంటే ఆ భూములపై ఆధారపడ్డ పశువుల యజమానులకు, జీవాలకు, కూలీలకు, అందరికీ పరిహారం చెల్లించి తీరాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించి తీరాలని, కుటుంబంలో పని చేసే వారందరికీ నెలకు రూ.2500 చెల్లించాలని తెలిపారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడిపి భూములు లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. రైతులకు మద్దతు పలకాలి: కొల్లి వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్ మాట్లాడుతూ రాజకీయపార్టీలకు అతీతంగా రైతులకు మద్దతు అందరూ పలకాలని పిలుపునిచ్చారు. ఈ భూములపై ఆధారపడ్డ అందరినీ పోరాటంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత వై.నరసింహారావు , సీపీఎం కార్యదర్శి కళ్ళం వెంకటేశ్వరరావు, నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, బొమ్మారెడ్డి రోసిరెడ్డి, పిల్లి మహేశ్వరరావు, బెజవాడ తాతబ్బాయి, అబ్ధుల్ బారి, కైలే ఏసుదాస్, మల్లంపల్లి జయమ్మ, వైఎస్సార్సిపి నాయకుడు బండి నాగసాంబిరెడ్డి, సిపిఐ నాయకుడు పడమట నరేష్, పాలకేంద్రం అధ్యక్షుడు ఉయ్యూరు శ్రీరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.