surabhi drama theatre
-
ఆ.. బాలగోపాలం!
బృందావనమాలి.. ఈ బృందానికి నిత్య అతిథి. వేణుగానలోలుడు వీరి తెర వేలుపు. పౌరాణిక నాటకాలకు పుట్టినిల్లుగా శోభిల్లుతున్న సురభి కళా వేదికకు నల్లనయ్యు సుపరిచితుడు. ఆ ఉవ్ముడి కుటుంబానికి కన్నయ్యు ఉవ్ముడి ఆస్తి. ఈ నాటకవుండలిలోని పొత్తిళ్లలోని బిడ్డ కూడా రంగస్థలమెక్కేది.. వెన్నదొంగ వేషంతోనే. దేవకి పంటగా పుట్టినప్పటి నుంచి.. గోకులంలో చూపిన వూయులు.. బృందావనంలో చేసిన రాసలీలలు.. ద్వారక పాలకుడిగా.. బావ బండి తోలిపెట్టిన సారథిగా.. ఆ నందగోపాలుడి ఆనందలీలలు.. సురభి కళాకారులు వేస్తే చూడాల్సిందే.. వారు చెప్పే ఆ లీలలు వినాల్సిందే. కావ్యేశు నాటకం రమ్యం అని మహాకవి కాళిదాసు అంటే.. అందులో సురభి నాటకం రసరవ్యుం అంటారు కళాభివూనులు. రావుుడు, శివుడు, విష్ణువు ఇలా సురభికళాకారులు అభినరుుంచని పాత్రలు లేవు. ఇలా ఎన్ని అవతారాలెత్తినా.. జగన్నాటక సూత్రధారి పాత్రంటే వారికి ప్రాణం. ఆ గోపాల బాలుడు సురభి ఒళ్లో ఆడుకునే పసివాడు. ఏటా సువూరు 150కి పైగా కృష్ణావతారాలు ఉంటారుు వారి నాటకాల్లో. అందులో ఓ యూైభె సార్లు కృష్ణలీలలు, ఇంకో వందసార్లు వూయూబజార్ నాటకం కోసం ఆ కళాకారులు నల్లనయ్యును ఆవాహన చేసుకుంటారు. అద్భుతనటనా విన్యాసంతో సాక్షాత్త్తూ ఆ పరవూత్ముని కళ్ల ముందుంచుతారు. సురభి ముంగిట ముత్యం బారసాల పూర్తరుున వెంటనే సురభి పిల్లలు జీవించేది నాటకంలోనే. అదీ.. కంసుడి చెరసాలలో పుట్టిన పాలబుగ్గల బాలకృష్ణుడి రూపంలో! అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నెలు దొంగిలిస్తూ సురభి బాలల చూపే అభినయుం.. ఆ యుశోదవ్ముకు బాలకృష్ణుడిని జ్ఞప్తికి తెస్తుంది. కాళీయు పడగలపై నాట్యవూడే సన్నివేశం చూస్తే ఆబాలగోపాలం ఆ బాల గోపాలుడిని తన్మయుత్వంతో చూస్తూ ఉండిపోవాల్సిందే. గోవర్ధన గిరినెతే ్త సన్నివేశానికి గోకులవుంతా దాసోహం కాకతప్పదు. కురుక్షేత్రంలో వీళ్ల విశ్వరూపానికి అసలు కృష్ణుడు సైతం చేతులు జోడిస్తాడేమో.. అదీ సురభి ప్రత్యేకత. కృష్ణుడు వాళ్లకు ఓ పురాణ పురుషుడు కాదు.. వాళ్లింటి బిడ్డ. అందుకే సురభివుూర్తులు శ్రీకృష్ణపాత్రలో అంతలా లీనవువుతారు. తాడుచ్చుకుని కొట్టింది.. ఈ నటనసూత్రధారి పాత్రను అంతలా పండిస్తున్న ప్రస్తుత సురభి కళాకారులు.. పద్మశ్రీ సురభి నాగేశ్వర్రావు (సురభి బాబ్జి), ఆర్.పద్మజ. ‘మేం నేర్చుకున్న తొలి పద్యం కృష్ణపాత్రదే. నాకు నాలుగేళ్లున్నప్పుడు ‘కృష్ణలీలలు’లో చిన్నికృష్ణుడిగా నటించా. యుశోదగా వూ అవ్ము సుభద్రవ్ము, పూతనగా వూ వదిన నటించారు. పూతన కోసం రాక్షసి రూపంలో ఓ వూస్క్ తయూరు చేశారు. పూతన ఒళ్లో ఉండి పాలు తాగేటప్పుడు ఒక్కసారిగా లైట్లు ఆరిపోతారుు. వుళ్లీ లైట్లు వె లిగే సరికి వూ వదిన రాక్షసి వూస్క్లో దర్శనమిచ్చింది. అంతే స్టేజ్‌మీదే పరిగెత్తా. జనాలు అదీ నాటకంలో భాగమే అనుకున్నారు. తెరదించాక.. వూ అవ్ము తాడిచ్చుకుని కొట్టింది’అని గతం గుర్తు చేసుకున్నారు సురభి నాగేశ్వర్రావు. నారీనారీ.. మెరిసె మురారి సురభిలో కృష్ణుడి వేషాలకు సాధారణంగా మహిళలే ప్రసిద్ధి. కాస్త గాంభీర్యం.. ఇంకాస్త నయుగారం.. అంతకుమించి ఒయ్యూరం.. ఇవన్నీ ఆడవాళ్లు అవలీలగా ఒలికించగలరు. అలాంటి కీర్తి సాధించిన ఈ తరం కళాకారిణి ఆర్.పద్మజ. ‘నా చిన్నతనంలో వూ అవ్మువ్ము వేసిన కృష్ణపాత్ర చూసి ఎలాగైనా నేనూ ఆ పాత్ర చేయూలని కలలు కనేదాన్ని. తర్వాత చాలా కాలం ఆ పాత్ర వూ పెద్దనాన్న పోషించారు. అనారోగ్యం కారణంగా ఆయున ఆ పాత్ర వేయులేని పరిస్థితి వచ్చింది. అప్పుడు కృష్ణుడి వేషం వేస్తానని నేను వుుందుకొచ్చాను. విగ్గు.. బరువైన కిరీటం.. ఒంటికి పూసుకున్న నీలిరంగుతో విపరీతమైన వేడి.. ఇవేవీ తెలియునీయుకుండా అభినరుుంచాలి. 1995 నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి వేషం నాదే’ అని తన జ్ఞాపకాలు పంచుకున్నారు పద్మజ. ఒక్క కృష్ణపాత్రే కాదు.. పురాణపాత్రలన్నీ సురభి కుటుంబంలో సభ్యులే. వాళ్ల కష్టసుఖాల్లో భాగస్వావుులే. కళను గుర్తించకపోరుునా.. కనీసం తవు కుటుంబం సాగిస్తున్న సవుష్టి జీవన విధానాన్ని అరుునా గుర్తించాలని కోరుతున్నారు సురభి కళాకారులు. -సరస్వతి రమ -
‘కళ’తప్పిన బతుకులు
=సురభి నాటకాలకు తగ్గిన ఆదరణ = కళాకారుల భవిష్యత్ ప్రశ్నార్థకం = అంతరిస్తున్న నాటక బృందాలు అద్భుత సహజ హావభావాలు.. స్పష్టమైన వాక్పటిమ.. సంభాషణ సంవిధానం.. రాజసం ఉట్టిపడే నటన.. సురభి కళాకారులకే సొంతమైన ఆభరణాలు. పేరులోనే దేవతలను చేర్చుకున్న వీరు నటనామృతం సేవించి నాటకాల్లో అమరత్వం పొందారు. తమ నటనా వైదుష్యంతో ప్రేక్షకులను కట్టిపడేసి విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నాటక సమాజంలో తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న సురభి కళాకారులు నేడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలో నిరాదరణకు గురవుతూ సరైన నాటకాలు లేక నానా కష్టాలు పడుతున్నారు. పామర్రు, న్యూస్‌లైన్ : తొలుత సురభి నాటకాన్ని శ్రీకమలానంద నాటక సమాజంగా వ్యవహరించేవారు. తర్వాత ద శలో శ్రీవినాయక నాట్యమండలి(సురభి)గా రూపాంతరం చెందింది. దీనిని పనారస గోవిందరావు 1885లో స్థాపించారు. కడప జిల్లాలోని సురభి గ్రామం లో సుమారు వందేళ్ల కిందట శ్రీవినాయక నాట్యమండలి ఏర్పడింది. అప్పుడే పలువురు కళాకారులు సుమారు 40 బృందాలుగా ఏర్పడి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వివిధ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఆధునిక సమాజంలో తమ నాటకాలకు ప్రోత్సాహం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని శ్రీవినాయక నాట్యమండలి కార్యదర్శి రేకందార్ వేణుగోపాలరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. తొలి తెలుగు టాకీ మూవీలో సురభి కళాకారులు తొలి తెలుగు టాకీ మూవీ ‘భక్తప్రహ్లాద’లో సురభి సంస్థ సభ్యులైన కృష్ణాజీ, మునిపల్లిరాజు, సురభి కమలాభారుు ప్రధాన పాత్రలు పోషించారు. తొలి గ్రామఫోన్‌ను సురభి కుటుంబ సభ్యులైన పాపాభాయి, వెంకూభాయి పాడారు. ప్రభుత్వం ఆదుకోదూ.. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన సురభి నాటకాలు ఇప్పుడు అక్కడక్కడ అడపదడపా మాత్రమే ప్రదర్శితమవుతున్నాయి. ఈ కళకు ఆదరణ కరువై అంతరించి పోవడంతో కళాకారులకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇతర వృత్తుల్లో రాణించలేక కళాకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వీరిని ఆదుకోలేదు. విశ్వ కళా మహోత్సవంలో విశేష ఆదరణ స్థానిక గగన్‌మహల్ ఎదురుగా నిర్వహిస్తున్న విశ్వ కళా మహాత్సవాల్లో ప్రదర్శిస్తున్న సురభి నాటకాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈనెల 29 నుంచి ఆదివారం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇప్పటివరకు శ్రీకృష్ణలీలలు, బాలనాగమ్మ, భక్తప్రహ్లాద, మాయూబజార్, శ్రీనివాస కల్యాణం నాటకాలు నిర్వహించారు. చివరిగా పాతాళభైరవి నాటకాన్ని ఆదివారం ప్రదర్శించనున్నారు. వైఎస్ వల్లే గుర్తింపు కళలకు, కళాకారులకు గుర్తింపు తెచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తినేందుకు తిండి లేక నిరాదరణకు గురైన సమయంలో వైఎస్ మా కులాన్ని బీసీ(బీ)లో చేర్పించి అండగా నిలిచారు. మాకు ఆదరణ కల్పించారు. - రేకందార్ వేణుగోపాలరావు, శ్రీవినాయక నాట్యమండలి (సుర భి) కార్యదర్శి