suraksha
-
ప్రజారోగ్యం కోసం సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు
-
జగనన్న సురక్షకు సర్వం సిద్ధం
సాలూరు: తన పాలనలో పార్టీల కతీతంగా, అర్హతే ప్రామాణింగా, అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో చారిత్రక నిర్ణయానికి తెరతీశారు. ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే నూతన కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు. కార్యక్రమం విధివిధానాలు ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యుటేషన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేషన్, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్‌లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు. ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు. కార్యాచరణ ఇలా ప్రతి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్లు ఒక టీమ్‌గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీ/మరో టీమ్‌గా ఏర్పాటవుతారు. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అర్హులెవరైనా ఏవైనా సాంకేతిక, ఇతర కారణాల వల్ల పథకాలు పొందలేకపోతే వారిని గుర్తించి పథకాలు అందేలా చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రధాన సర్టిఫికెట్లు సత్వరమే ప్రజలకు అందించనున్నాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి -
హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’.. పోలీసుల ర్యాలీ (ఫోటోలు)
-
జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలకు లోనైన జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకి సురక్షా గ్రూప్‌నకు లైన్ క్లియరైంది. రుణదాతలు, గృహ కొనుగోలుదారుల నుంచి సురక్షా బిడ్‌కు అనుమతి లభించింది. దీంతో ఫ్లాట్లను కొనుగోలు చేసినా సొంతం చేసుకునేందుకు వీలులేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జేపీ ఇన్ఫ్రా వివిధ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టింది. వీటికి సంబంధించి 20,000 మందికిపైగా గృహ కొనుగోలుదారులు ఫ్లాట్ల కోసం వేచిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10 రోజులుగా.. జేపీ ఇన్ఫ్రా టేకోవర్‌కు అటు పీఎస్‌యూ దిగ్గజం ఎన్బీసీసీ, ఇటు సురక్షా గ్రూప్ వేసిన బిడ్స్‌పై 10 రోజులపాటు వోటింగ్ ప్రాసెస్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సురక్షా గ్రూప్ బిడ్‌కు 98.66 శాతం మద్దతు లభించినట్లు తాజాగా రిజల్యూషన్ అధికారి అనుజ్ జైన్ వెల్లడించారు. ఎన్బీసీసీకి 98.54 శాతం వోట్లు లభించినట్లు తెలియజేశారు. వెరసి అతిస్వల్ప మార్జిన్‌తో సురక్షా గ్రూప్ ముందంజ వేసినట్లు వివరించారు. చదవండి : ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
ఉమా సుధీర్‌కు చమేలీ దేవి అవార్డు
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ 2017 సంవత్స రానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డుకు ఎంపికయ్యారు. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విస్తృతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది. ఉమా సుధీర్ విశ్లేషణాత్మక కథనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అవగాహన కలిగించేందుకు దోహ దపపడ్డాయని అవార్డు అందించే మీడి యా ఫౌండేషన్ పేర్కొంది. కుష్టు వ్యాధి వల్ల వేలిముద్రలు కోల్పోయి ప్రభుత్వ పథకాలకు దూరమైన వారి దుస్థితిపై కథనాలు రాసిన న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు సురక్షను కూడా తగిన విధంగా గౌరవించాలని జ్యూరీ సిఫార్సు చేసింది. -
సురక్షిత రక్త సేకరణలో మేలకువలు పాటించండి
సురక్షిత రక్త సేకరణలో మేలకువలు పాటించండి తిరుపతి మెడికల్ : ప్రాణప్రాయ స్థితిలోని రోగికి రక్తం అందించడం చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన రక్త సేకరణ, పంపిణీలో సరైన మెళుకువలను పాటించాలని తిరుపతి రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బి.సిద్దా నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. రోగులకు ‘సురక్షిత రక్తం సేకరణ,పంపిణీ ’ అనే అంశంపై తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్లో శనివారం వైద్యులు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని బ్లడ్ బ్యాంక్ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులకు అవగాహన సదస్సును నిర్వహించారు. తిరుపతిలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్ మోడర్న్ బ్లడ్ బ్యాంక్ (రుయా ఆసుపత్రి) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు ఆగస్టు 24వ తేది వరకు దశల వారీగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా శనివారం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, క్యాథలిక్ హెల్త్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త సహకారంతో ప్రారంభించిన ఈ సదస్సులో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రక్తం సేకరణ, తిరిగి రోగికి రక్తాన్ని పంపిణీ చేసే సమయంలో వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు తీసుకోవాల్సిన మెళుకువలపై ఆయన విశదీకరించారు. రుయా పెథాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ కృష్ణ, మరో ప్రొఫెసర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ రక్త సేకరణలో ఏమాత్రం ఏమరు పాటు వ్యవహరించినా ఓ నిండు ప్రాణం బలికావాల్సి వస్తుందన్నారు. తిరుపతిలోని మోడర్న్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.ఎవరైనా సరే రక్తం నిల్వ, కావాల్సిన వారు www.health4all.online సైట్లో పూర్తి వివరాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఏసీఎస్ జిల్లా ప్రోగ్రాం మేనేజరు లలిత, క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. -
80 లక్షల మంది కస్టమర్లకు బీమా: టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘సురక్ష’ బీమా పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఆరు సర్కిళ్లలో 1.8 కోట్ల మంది కస్టమర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, సుమారు 80 లక్షల మంది బీమా రక్షణ పొందారని కంపెనీ వెల్లడించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 20 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 శాతం మంది బీమా కవరేజ్ పొందారని టెలినార్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. టెలినార్ సురక్ష కింద కస్టమర్లకు రూ.50 వేల వరకు బీమా కవరేజ్ ఇస్తున్నట్టు చెప్పారు. బీమా కోసం వినియోగదార్లు ఎటువంటి ప్రీమియం చెల్లించక్కర లేదు. ఒక నెలలో చేసిన రిచార్జ్ మొత్తానికి రూ.50 వేలకు మించకుండా తదుపరి నెలకు 100 రెట్లు కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు జనవరిలో మొత్తం రూ.200 రిచార్జ్ చేసిన వినియోగదారుడికి ఫిబ్రవరిలో రూ.20 వేల బీమా కవరేజ్ ఇస్తారు. ఒక నెలలో కనీసం రూ.40 రిచార్జ్ చేయాలి. క్లెయిమ్‌ను వారం లోపే పరిష్కరిస్తారు. కస్టమర్ మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ గుర్తింపు కార్డు, సిమ్ కార్డుతో కంపెనీని సంప్రదించాలి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక కస్టమర్ చనిపోతే ఆయన కుటుంబానికి రూ.50 వేల చెక్కును కంపెనీ అందజేసింది. దేశవ్యాప్తంగా కంపెనీ చందాదారుల సంఖ్య 5 కోట్లకుపైమాటే.