ఉమా సుధీర్‌కు చమేలీ దేవి అవార్డు | NDTV's Uma Sudhir gets 2017 Chameli Devi Jain award | Sakshi
Sakshi News home page

ఉమా సుధీర్‌కు చమేలీ దేవి అవార్డు

Published Mon, Mar 5 2018 3:24 AM | Last Updated on Mon, Mar 5 2018 3:24 AM

NDTV's Uma Sudhir gets 2017 Chameli Devi Jain award - Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌ 2017 సంవత్స రానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డుకు ఎంపికయ్యారు. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విస్తృతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది. ఉమా సుధీర్‌ విశ్లేషణాత్మక కథనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అవగాహన కలిగించేందుకు దోహ దపపడ్డాయని అవార్డు అందించే  మీడి యా ఫౌండేషన్‌ పేర్కొంది.  కుష్టు వ్యాధి వల్ల వేలిముద్రలు కోల్పోయి ప్రభుత్వ పథకాలకు దూరమైన వారి దుస్థితిపై కథనాలు రాసిన న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ జర్నలిస్టు సురక్షను కూడా తగిన విధంగా గౌరవించాలని జ్యూరీ సిఫార్సు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement