Surat diamond
-
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనాన్ని ప్రారంభించిన మోదీ
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. సూరత్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. సూరత్‌లో రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading both rough and polished diamonds as well as jewellery. The… pic.twitter.com/2bEz3J3RGv — ANI (@ANI) December 17, 2023 సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
ఇది వ్యాపారి ఐడియా
మహారాష్ట్ర, పూనా జిల్లా పింప్రి– చించ్వాడ్లో శంకర్ కురాడే గుర్తున్నాడా? బంగారు మాస్క్ చేయించుకున్న సంపన్నుడు. ఆ మాస్కు మన కళ్ల ముందు నుంచి చెరిగి పోయేలోపు అలాంటిదే మరో విచిత్రం వజ్రాల ఫేస్ మాస్క్. ధర లక్షా నలభై వేల రూపాయలు. కుశాల్భాయ్ సూరత్‌లో ఆభరణాల వ్యాపారి. అతడు వజ్రాలు పొదిగిన ఫేస్ మాస్కులను తయారు చేశాడు. ఒక్కో మాస్కు ధర డిజైన్‌ను బట్టి లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇంత ధర పెట్టి ఎవరు కొంటారని తయారు చేశారు? అని అడిగితే దుకాణం యజమాని మరీ విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఇప్పుడు మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. పెళ్లి వేడుకలో మంచి దుస్తులు, ఆభరణాలు ధరించిన తర్వాత ముఖానికి మామూలు సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు ధరిస్తే చూడడానికి ఏం బాగుంటుంది? ఇలాంటి వజ్రాల మాస్కు ధరిస్తే అందానికి అందం, దర్జాకు దర్జా అంటున్నాడు. ఇంకా... శంకర్కురాడే బంగారు మాస్క్కే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేశాడు. వజ్రాల మాస్కు లక్షకు కూడా వస్తుంది కదా! అని తార్కికంగా ప్రశ్నిస్తున్నాడు కూడా. పైగా నా డైమండ్ మాస్క్‌ను ఎన్నాళ్లయినా ధరించవచ్చు. కరోనా పోయిన తర్వాత నా దుకాణానికి వచ్చి మార్చి మరో ఆభరణం చేయించుకోవచ్చు కదా! అని చాలా కన్విన్సింగ్‌గా చెప్తున్నాడు. అతడి మాటలు ఎక్కువ సేపు వింటే ఎవరైనా సరే డైమండ్ మాస్క్ మాయలో పడేట్టుగానే ఉన్నాయి. కుశాల్ భాయ్ తన మాస్కుకు ‘డి కుశాల్ భాయ్’ ఇంగ్లిష్ అక్షరాల ఆకారంలో వజ్రాలను అమర్చుకున్నాడు. ఈ అక్షరాలకు కొద్దిగా పైన ‘డి.కె’ అని లోగో కూడా వజ్రాలతోనే ఉంది. -
ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు
-
ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు
సూరత్ వజ్రాల వ్యాపారి దీపావళి కానుక సూరత్: తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రతిఏడాదీ ఘనమైన దీపావళి కానుకలిచ్చే సూరత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధొలాకియా.. ఈ ఏడాది కూడా భారీ కానుకలను ప్రకటించారు. బాగా పనిచేసే ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లను కానుకగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ధొలాకియా.. ఈ ఏడాది 1716 మంది బాగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించామన్నారు. 1100 చదరపు అడుగుల ఇంటికి (ధర 15 లక్షలు), కారుకు మొదటి ఐదేళ్లపాటు రూ.5వేల ఈఎంఐ (నెలసరి వాయిదా)ని కంపెనీ భరిస్తుంది. తర్వాత మొత్తం ఈఎంఐ (ఇంటికి రూ.11వేలు, కారు ధరను బట్టి) ఉద్యోగే కట్టుకోవాలి. అంటే ఉద్యోగి ఇల్లు కొనుక్కునేందుకు కంపెనీ రూ.3 లక్షలు సాయం (ఉచితం) చేస్తోందన్నమాట. గతేడాది కూడా 491 కార్లు, 200 ఫ్లాట్లను గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ కోటీశ్వరుడు.. అంతకుముందు సంవత్సరం.. రూ. 50 కోట్లను పండగబోనస్గా ఉద్యోగులకు పంచిపెట్టారు. తన మామయ్య దగ్గరినుంచి అప్పు తీసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టిన ధొలాకియా కోటీశ్వరుడిగా ఎదిగినా.. తన కుమారుడికి డబ్బు విలువ చెప్పేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేయించిన సంగతి తెలిసిందే.