surat diamond hub
-
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనాన్ని ప్రారంభించిన మోదీ
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. సూరత్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. సూరత్‌లో రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading both rough and polished diamonds as well as jewellery. The… pic.twitter.com/2bEz3J3RGv — ANI (@ANI) December 17, 2023 సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
కరోనా : వజ్రాల పరిశ్రమ మూసివేత
అహ్మదాబాద్ : సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కేసులు అంతకంతకూ పెరుతూనే ఉన్నాయి. దీంతో ఆయా సంస్థలను మూసివేయాలని శనివారం సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) తెలిపింది. మిగతా సిబ్బంది కూడా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దేశంలోని అతిపెద్ద డైమండ్ కటింగ్, పాలిషింగ్ హబ్‌లుగా పేరున్న సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే.. ) గత మూడు రోజుల్లోనే ఎనిమిది డైమండ్ యూనిట్లలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఎనిమిది యూనిట్లను మూసివేస్తున్నట్లు ఎస్ఎంసి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ ఆశిష్ నాయక్ శనివారం తెలిపారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించని యూనిట్లకు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సామాజిక దూరం, ఫేస్ మాస్క్ , శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వజ్రాల యూనిట్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. సూరత్‌లో సుమారు 6,000 డైమండ్ యూనిట్లు ఉండగా, దాదాపు 6.5 లక్షలమంది కార్మికులు పనిచేస్తుంటారు. జూన్ 1న పరిశ్రమలు తెరిచేందుకు కేంద్రం అనుమతివ్వడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ యూనిట్లలో 2 నుంచి 2.25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) -
‘మీ కోసం ఇజ్రాయెల్ వెళుతున్నాను’
న్యూఢిల్లీ: సూరత్ వజ్రాల వ్యాపారులు, కార్మిక ప్రజల తరుపున తాను త్వరలో ఇజ్రాయెల్ వెళుతున్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వజ్రాల వ్యాపారంలో భారత్‌లో సూరత్ పెద్దదని, ప్రపంచంలో మాత్రం ఇజ్రాయెల్ కీలక దేశంగా మారి వజ్రాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సూరత్‌లోని డైమండ్ హబ్‌కు చెందినవారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను త్వరలోనే ఇజ్రాయెల్ వెళుతున్నాను. నిజానికి ఇజ్రాయెల్ వెళుతున్న తొలి ప్రధానిని నేనే. నేను మీ తరుపునే అక్కడి వెళుతున్నాను. మీకు ఆ దేశంతోనే వర్తక సంబంధాలు ఉన్నాయి’ అని చెప్పారు. జూలై నెలలో మోదీ సూరత్ వెళ్లనున్నారు. ఇది నిజానికి చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. హంబర్గ్‌లో జరిగే జీ 20 సదస్సుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇజ్రాయెల్ వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది భారత్- ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 25 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ చేయబోవు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.