సూరత్ నుంచి నేరుగా దుబాయ్‌కి...
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మే 15 నుంచి సూరత్–దుబాయ్ మధ్య నేరుగా విమాన సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయి. చవకగా విదేశీ సేవలందించే, ఎయిరిండియా అనుబంధ విభాగమైన ఈ సంస్థ ఇందుకోసం 189 సీట్లున్న బోయింగ్ 737–800 విమానాలను వినియోగిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు దర్శన్ జార్దోశ్, సీఆర్ పాటిల్ మంగళవారం ఎయిరిండియా సీఎండీ అశ్వని లోహానిని కలుసుకుని సూరత్ నుంచి మరిన్ని విమానాలు నడపడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
ఎఫ్ఏఏ అనుమతులను అనుసరించి మే 15 నుంచి సూరత్–దుబాయ్ మధ్య వారానికి 3 సార్లు విమాన సేవలుంటాయని ఆ తరువాత జార్దోశ్ ట్వీట్ చేశారు. సూరత్ నుంచి దుబాయ్‌కి విమానం నడపాలన్న ప్రణాళికకు ఆమోదం లభించిందని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. తొలుత ఆ మార్గంలో 50–60 శాతం సీట్లు నిండుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. సూరత్ నుంచి దేశీయంగా మరిన్ని విమానాలు నడపాలని కూడా ఎయిరిండియో యోచిస్తోంది.