రైల్వేట్రాక్‌పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
ప్రకాశం (కంభం) : ప్రకాశం జిల్లా కంభం మండలం సూరేపల్లి గ్రామంలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం సాయంత్రం విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో అటువైపు వెళ్తున్న రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి డోన్ వెళ్తున్న రైలు గంట నుంచి అక్కడే నిలిచిపోయింది. కాసేపట్లో అదే మార్గంలో రానున్న కాచిగూడ-గుంటూరు రైలుకు కూడా అంతరాయం కలుగనుంది. రైల్వేట్రాక్‌పై పడ్డ విద్యుత్ వైర్లను తొలగించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.