షారుక్ ఖాన్ కేసులో జోక్యం చేసుకోం: బాంబే హైకోర్టు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై నమోదైన కేసులో తాము జోక్యం కలిగించుకోబోమని బాంబే హైకోర్టు సోమవారం స్సష్టం చేసింది. అద్దె గర్బం ద్వారా జన్మించిన తమ కుమారుడు అబ్ రామ్ కు లింగ నిర్ధారణ పరీక్షలు చేశారనే ఆరోపణలపై షారుక్, ఆయన భార్య గౌరీ ఖాన్ లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త వర్ష దేశ్ పాండే దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సాధన జాదవ్ విచారించారు. ఈ కేసులో ఆగస్టు 8 తేదిన ప్రతివాదులకు ఆగస్టు 8 తేదిన నోటీసులు జారీ చేసి సెప్టెంబర్ 12న విచారణకు హాజరుకావాలని తెలిపారు.
అయితే సెప్టెంబర్ 12 కంటే ముందే విచారణ చేపట్టాలని దేశ్ పాండే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రి కన్సెప్షన్ అండ్ ప్రీ నటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్ డీటీ) యాక్ట్ కింద కేసులను ఆరు నెలలోపే విచారణ ముగించాలని ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలను దేశ్ పాండే మీడియాకు వివరించారు.