మొరాయించిన టీటీడీ సర్వర్లు
తిరుమల: ఆన్లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం భక్తులు పోటీపడ్డారు. దీంతో టీటీడీ సర్వర్ మొరాయించింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి 5 వేల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేశారు. లక్షలాది భక్తులు ఒకే సారి లాగిన్ అవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిపోయి మొరాయించింది. సర్వర్ పని చేయకపోవడంతో టిక్కెట్ల కోసం భక్తులు వేచి చూడక తప్పలేదు.