surver down
-
తిరుమలలో సర్వర్ డౌన్.. భక్తుల ఇక్కట్లు
సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయంలో గంటకుపైగా కంప్యూటర్లు పని చేయలేదు. సర్వర్ డౌన్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులు కోసం గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు గాస్తున్నారు. కంప్యూటర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు. -
సర్వర్ డౌన్
- బదిలీ ఆప్షన్ ఇవ్వలేక పోయిన ఉద్యోగులు – 10వ తేదీతో ముగిసిన గడువు అనంతపురం అర్బన్ : రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల అప్‌లోడ్‌కు బ్రేక్ పడింది. బుధవారం చివరి గడువు కాగా ఆ రోజు సర్వర్ డౌన్ కావడంతో దాదాపు 40 మంది రెవెన్యూ ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చుకోలేకపోయారు. రెవెన్యూ శాఖలో అన్ని కేటగిరీల్లో దాదాపు 80 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. సీనియార్టీ జాబితా సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం మార్గదర్శాలు జారీలో జాప్యం జరిగి ఈ నెల 7న విడుదల చేసింది. దీంతో ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు మూడు రోజుల గడువు ఉండడంతో అన్ని శాఖల ఉద్యోగులు అప్లోడ్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో చివరి రోజు సర్వర్‌పై ఒత్తిడి పెరగడంతో అది మొరాయించింది. దీంతో అనేక మంది అప్లోడ్ చేసుకోలేక తీవ్ర నిరాశకు గురయ్యారు.