పూరైన ఇంటింటి కాళ్లవాపు సర్వే
వీఆర్ పురం :
కాళ్ల వాపుతో పలువురు మృత్యువాత పడుతున్న నేపధ్యంలో మంగళవారం నుంచి మండల వ్యాప్తంగా నిర్వహించిన సర్వే పూర్తయింది. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నట్టు తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్ శుక్రవారం తెలిపారు. మొత్తం 7748 కుంటుంబాలను సర్వే చేసినట్టు చెప్పారు. సర్వే బృందం కాళ్ల వాపు లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి తొలుత రేఖపల్లి ఆస్పత్రికి తరలించేదని వారు తెలిపారు. అక్కడ వారిని వైద్య నిపుణులు పరీక్షించాక, అవసరమైన వారికి అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేవారని వివరించారు. మంగళవారం 18 మంది కాళ్ల వ్యాపు వ్యాధిగ్రస్తులను గుర్తించగా, నలుగురిని కాకినాడకు తరలించారన్నారు. బుధవారం 31 మందిని గుర్తించగా వారిలో 16మందిని, గురువారం 12 మందిని గుర్తించగా ఇద్దరిని ,శుక్రవారం నలుగురిని గుర్తించగా ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని చెప్పారు. శనివారం నుంచి మళ్లీ మండల వ్యాప్తంగా రెండో దఫా కాళ ్లవాపు సర్వే కొనసాగుతుందని వారు చెప్పారు.