ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు
సాక్షి, శ్రీకాకుళం: థియేటర్లకు ఆర్ఆర్ఆర్ సినిమా భయం పట్టుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదకరమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ప్రేక్షకులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్లో తెర ముందు ఇనుప కంచెను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. లో క్లాస్ టిక్కెట్ల సీట్లు ఉండే చోట ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ప్రమాదాలకు ఆస్కారం ముంది.
ఈ విషయాన్ని స్థానిక డీఎస్పీ ఎం.మహేంద్ర దృష్టికి అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను, ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు తీసుకెళ్లారు. దీంతో డీఎస్సీ ఆదేశాల మేరకు సీఐ అంబేడ్కర్ చర్యలకు ఉపక్రమించారు. సినిమా విడుదల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అభిమాన సంఘ నాయకులు చొరవ తీసుకోవాలని ప్రతినిధులకు సీఐ సూచించారు. డీఎస్పీ, సీఐని కలిసిన వారిలో లింగాల హరీష్, షేక్ మదీనా, నాని చరనిజం, చరణ్‌తేజ, సాయి మోహన్, శివ చెర్ర, పుక్కల నవీన్ ఉన్నారు.