పోలీసులపై దాడులు సరికాదు
భానుపురి, న్యూస్‌లైన్: నిత్యం ప్రజల రక్షణకు పాటుపడుతున్న పోలీసులపై ప్రజాప్రతినిధులు, ప్రజలు దాడులకు పాల్పడడం సరికాద ని పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల గోపిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల విధి నిర్వహణలో ఉన్న కృష్ణాజిల్లా జి.కొండూర్, నల్లగొండ జిల్లా డిండి పోలీస్‌స్టేషన్ ఎస్ఐలపై ఆయా ప్రాం తాల ప్రజలు దాడులకు పాల్పడటం, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐపై దాడి చేసేందుకు యత్నించాడని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసులతో స్నేహభావంతో మెలగాలని కోరారు.
ఎస్ఐలకు త్వరలో గెజిటెడ్ హోదా
రాష్ర్ట పరిధిలోని 5వేల మంది ఎస్ఐలకు గెజిటెడ్ హోదా త్వరలోనే కల్పించనున్నట్టు గోపిరెడ్డి పేర్కొన్నారు. పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్ అయిన రెండు సంవత్సరాలకే ఏఎస్ఐ పదోన్నతి వచ్చే లా, ఉద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య భద్రత ద్వారా ఉచిత వైద్య సేవలందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
10వ పీఆర్సీలో పోలీసు సిబ్బందికి వెయిటేజీ ఇంక్రిమెంట్లతో పాటు ప్రత్యేక అలవెన్స్‌ను పెంచాలని డిమాండ్ చేశా రు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న టీఏలు వెంటనే విడుదల చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో త్వరలో పోలీ సు క్యాంటీన్‌ను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు బి.అంతిరెడ్డి, గాలి శ్రీనివాస్, డి.దయాకర్, శాగంటి ఆదినారాయణమూర్తి, మేడిరాము, ఇబ్రహీం, చెన్నయ్య, సురేష్‌రెడ్డి, లక్ష్మ య్య, బొక్క రవీందర్‌రెడ్డి ఉన్నారు.