‘విభజన’తో కేంద్రానికి ముప్పే
కొత్తపేట, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజనకు కట్టుబడితే కేంద్ర ప్రభుత్వానికి ముప్పు తప్పదని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. తిరుపతిలో అలిపిరి ముఖద్వారం వద్ద నెలకొల్పనున్న టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డి. ఆదికేశవులు నాయుడు కాంస్య విగ్రహం కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపు దిద్దుకుంటోంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని పరిశీలించేందుకు వెంకటరమణ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి శనివారం ఇక్కడి శిల్పశాలకు వచ్చారు. ఈ సందర్భంగా రౌతు విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించిన విగ్రహాలతో రాజమండ్రిలో వుడయార్ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.