సూర్యారావుపేటలో గ్యాస్ పైప్లైన్ లీకేజీ
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సూర్యారావుపేట లైట్హౌస్ వద్ద గ్యాస్ లీకేజీ అయింది. రోడ్డు పక్కన చెట్లు కొడుతుండగా పొరపాటున గడ్డపార పైప్లైన్లోకి దిగబడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో భాగ్యనగర్ పైప్లైన్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని వెంటనే మరమ్మతులు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.