అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బొబ్బిలి: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవీధిలో జరిగింది. వివరాలు.. గొల్లవీధికి చెందిన బంగారురాజు(32) అనే వ్యక్తికి మూడేళ్ల క్రితమే వివాహమైంది. అయితే, బంగారురాజుకు గొల్లవీధికే చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఆ మహిళ ఇంట్లోనే బంగారురాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్ధానికలు సమాచారంతో పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.