ట్రేల మధ్యలో 12 మంది
చిలమత్తూరు(అనంతపురం): కర్ణాటకలోని కోలార్ జిల్లా ప్రాంతం నుంచి టాటా ఏస్ (ఏపీ03టీసీ 2432) వాహనంలో టమాట ట్రే ల మధ్య అనుమానాస్పదంగా వైఎస్సార్ జిల్లాకు వెళ్తున్న 12 మంది వ్యక్తులను స్థానిక పోలీసులు, అటవీ శాఖాధికారులు శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ మదన్మోహన్ తెలిపిన వివరాల మేరకు కోలార్ జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లాకు ఆటోలో టమాట ట్రేల మధ్య కొంతమంది అనుమానాస్పదంగా వెళ్తున్నారనే సమాచారం జిల్లా అటవీశాఖాధికారి నుంచి వచ్చిందన్నారు.
దీంతో చెక్‌పోస్టులో నిఘా ఉంచి ఆటో వాహనాన్ని ఆపి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఎస్ఐ జమాల్‌బాషా సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. అటవీశాఖ సిబ్బంది ఎంవీ నాగప్ప, కె.సంజీవరాయుడు, బి.శివయ్య, కానిస్టేబుల్స్ నాగరాజు, సురేష్ ఉన్నారు.