నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుంటూరుకు చెందిన శ్రీకాంత్ ప్రసన్న కుమార్ గా గుర్తించారు. కాగా అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
చదువులో ఒత్తిడి కారణంగానే శ్రీకాంత్ ప్రసన్న కుమార్ ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని తోటి విద్యార్థులు భావిస్తున్నారు. కళాశాల యాజమాన్యం మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నవీన్ అనే విద్యార్థి కూడా భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.