క్రిష్టియన్ మైనార్టీకి ‘మొండి చేయి’
ఇద్దరు ముస్లిం మైనారిటీలకు అవకాశం
మేయర్‌తో క్రిష్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాస్ వాగ్వాదం
అనంతపురం మెడికల్: అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నగర పాలక సంస్థ కో-ఆప్షన్ ఎన్నికల్లో క్రిష్టియన్ మైనార్టీకి మొండి చేయి చూపింది. ఎంపీ దివాకర్‌రెడ్డి, చీఫ విప్ కాలవ శ్రీనివాసులు సూచించిన వారికి ఇచ్చిన ప్రాధాన్యత క్రిష్టియన్ మైనార్టీకి ఇవ్వలేదని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. బుధవారం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో మైనార్టీ కోటా కింద ఉన్న రెండు స్థనాలను ముస్లిం వర్గాలక కేటాయించడం వివాదాస్పదమయ్యింది.
క్రిష్టియన్ వర్గాలను విస్మరించారంటూ టీడీపీ క్రిష్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈటె స్వామిదాస్ మేయర్ మదమంచి స్వారూపతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెలితే... కార్పొరేషన్ కౌన్సిల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో మైనార్టీ కోటా కింద ఉండే రెండు స్థానాల్లో ఒకటి ముస్లిం వర్గాలకు, మరొకటి క్రిష్టియన్ వర్గాలకు కేటాయించడం ఆనవాయితీ. ఈసారి క్రిష్టయన్ మైనార్టీకి అవకాశం కల్పించలేదు. దీంతో ఈటెస్వామిదాస్ స్థానం దక్కలేదు. అభ్యర్థులను ఖరారు చేస్తూ పంపిన షీల్డ్ కవర్లో ఆయన పేరు లేదు. మైనార్టీ కోటా కింద ఎన్నికైన ఇద్దరిలో ఎంపీ దివాకర్‌రెడ్డి వర్గానికి చెందిన షరీనా, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తరఫున మున్వర్ ఉన్నారు.
దీంతో ఈటెస్వామిదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియ వద్దకు వచ్చి మైక్ తీసుకుని... పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వలే దు.. మైనార్టీ కోటా కింద రెండు ముస్లిం వర్గాలకే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ స్వామిదాస్ నుంచి మైక్ లాక్కున్నారు.ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని, పార్టీ ఎవరిని సూచించిందో వారినే సభ్యులుగా ఎన్నుకున్నారని ఆమె వివరించారు. సందర్భంగా మేయర్‌తో ఈటెస్వామిదాస్ వాగ్వాదానికి దిగారు. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనా కృష్ణకుమార్, మరికొందరు కల్పించుకుని ఆయనను శాంతింపచేశారు.