తిరుపతిలో విద్యార్థి సంఘాల ధర్నా
తిరుపతి: పద్మావతి మెడికల్ కాలేజీ మొదటి విడత కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. అందుకు నిరసనగా శనివారం తిరుపతిలోని స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. పెద్ద ఎత్తున మెడికల్ సీట్లు అమ్ముకున్నారని.. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
దీంతో స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.