ఎస్వీయూ ఇంజనీరింగ్ విద్యార్థుల ఘర్షణ
సాక్షి, తిరుపతి: సినిమాల ప్రభావం విద్యార్థులపై బాగానే ఉంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అందులో సినిమాలో విద్యార్థులు గుంపులుగా విడిపోయి కొట్టుకుంటారు. తమ బలం సరిపోకపోతే బయటి కాలేజీ కాలేజీ విద్యార్థులు, వ్యక్తులను తీసుకు వచ్చి గొడవలకు దిగుతారు. ఇప్పుడు అలాంటి ఘటనే తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పరస్పర ఘర్షణలకు దిగారు. ఇందులో ఎస్వీయూ రిజిస్ట్రార్ బంధువు నితిన్ చౌదరి దాదాగిరికి పాల్పడ్డాడు. కాలేజీలో రెండు గ్రూపుల్లో నితిన్ చౌదరి ఒకదానికి నేతృత్వం వహిస్తున్నాడు. విద్యార్థుల మధ్య గొడవలు రావడంతో బయటి వ్యక్తులను పిలిపించి సహచరులపై దాడులకు తెగబడ్డాడు. ఇందులో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ కార్యాలయంపై దాడిచేశారు.