మేము సైతం...
సాక్షి అక్షర వేదిక త్వరలో...
నేను, నా ఇల్లు, నా వాకిలి బాగుంటే చాలు..
..ఇలా ఎన్నాళ్లు ఆలోచిద్దాం?!
విదేశాలలో ప్రతి వ్యవస్థ పక్కాగా ఉంటుంది.. మన దగ్గరే ఇలా..
..ఇలా ఎన్నాళ్లు మనల్ని మనం కించపరుచుకుందాం?!
కరెంటు లేదు, కాలనీలలో పరిశుభ్రత లేదు..
నీళ్లు లేవు, నాణ్యమైన రోడ్లు లేవు..
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు..
..ఇలా ఎన్నాళ్లని ఎదురుచూద్దాం?!
మన ఒంటిని బాగు చేసుకున్నట్టే..
మన ఇంటిని బాగు పరుచుకున్నట్టే..
మన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నట్టే...
మన పిల్లలను చక్కబెట్టుకున్నట్టే..
మన దేశాన్ని కూడా బాగుపరుచుకునేందుకు
మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ భారత్’ కోసం ఏకమవుదాం!
గ్రామాల నుంచి పట్టణాల దాకా..
పాఠశాలల నుంచి కళాశాలల దాకా..
కుటీర పరిశ్రమల నుంచి కర్మాగారాల దాకా..
వ్యక్తుల నుంచి వ్యవస్థలదాకా..
ఆచరించిన మార్గాలు..
అనుసరించిన విధానాలు..
ఆలోచింపజేసే కథనాలు..
ఆచరణసాధ్యమైన పరిష్కారాలు..
స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు..
పాలుపంచుకుంటున్న వ్యవస్థలు..
మీ దృష్టికి వచ్చినవి ఏవైనా..
మీరు చేస్తున్న కృషి ఏదైనా..
‘సాక్షి’ వాటికి అక్షర వేదికగా నిలుస్తుంది..
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో స్వచ్ఛందంగా తోడవుతుంది.
రండి.. ‘మేము సైతం’ అంటూ అందరం ఈ ఉద్యమంలో పాల్గొందాం..
మన భారత దేశాన్ని స్వచ్ఛంగా చూసుకుందాం.
మా చిరునామా
మేము సైతం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.
email: swachhbharat.sakshi@gmail.com, swachhbharat@sakshi.com