swachhata hi seva
-
పాఠశాలలకో రేటింగ్
సాక్షి, హైదరాబాద్ : మార్కులను బట్టి విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తుంటారు కదా.. మరి స్కూళ్లకు? స్కూళ్లకేమో రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా స్టార్ స్కూల్స్– 5 స్టార్ నుంచి 1 స్టార్ వరకు నిర్ణయించా లని చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోపాటు ఇతర అంశాల్లో మెరుగుదల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పరిశుభ్రతకు పట్టం.. క్రమశిక్షణకు పెద్దపీట.. స్వచ్ఛతకు చేయూత.. ఇదీ సర్కార్ బడుల ఇతర ప్రాధాన్యతాంశాలు. ప్రతి అంశానికి మార్కులు.. ఆ మార్కుల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రోగ్రెస్ తీసుకురావాలని నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి సూచన మేరకు ఆరు అంశాల్లో మార్కులు కేటా యించేందుకు విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాకమిషనర్ విజయ్‌కుమార్ డీఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. మార్కులు ఇలా.. వ్యక్తిగత పరిశుభ్రత పిల్లలు ప్రతిరోజు స్నానం చేయడం, మరుగుదొడ్డి వినియోగించాక, భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వంట సిబ్బంది.. వంట సిబ్బంది గోర్లు కత్తిరించుకోవడం, వారు జుట్టు ముడి వేసుకొని క్యాప్ ధరిం చడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రక్షిత నీరు.. రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచ డం, నీటి ట్యాంకును ప్రతినెలా శుభ్రం చేయ డం, తాగునీటి పాత్రలపై మూతలు పెట్టడం వంటి అంశాల్లో మార్కులు ఇస్తారు. మరుగుదొడ్లు.. మరుగుదొడ్లలో నీటిని అందుబాటులో ఉంచడం, శుభ్రమయ్యే వర కు నీరు పోయడం, బాలికల టాయిలెట్లో మూత కలిగిన చెత్తబుట్ట ఉంచటం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పరిసరాల పరిశుభ్రత.. వ్యర్థ జలాన్ని మొక్కలకు మళ్లించడం, దాతల సహకారంతో పాఠశాల గదులకు సున్నం వేయించడం, తరగతి గదుల్లో చెత్త బుట్టలను అందుబాటులో ఉంచడం వంటి అంశాల ఆధారంగా మార్కులను ఇస్తారు. ఆ మార్కులను బట్టి రేటింగ్ ఇస్తారు. అడ్వొకసీకి అత్యధిక మార్కులు.. స్వచ్ఛ పాఠశాలలో భాగంగా అడ్వొకసీ విభాగానికి అత్యధిక మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. స్వచ్ఛతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి, వారు ఇతరులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టడం, స్వచ్ఛత క్లబ్‌ల ఏర్పాటు, అమలు, స్వచ్ఛ నమస్కారం, 90 శాతానికి మించి నెలవారీ హాజరు అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, పీఈటీ/టీచర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛత క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. వీటన్నింటినీ స్వీయ మూల్యాంకనం చేసుకొని ప్రతి పాఠశాలకు రేటింగ్ ఇచ్చుకోవాలి. ఆ వివరాలను పై అధికారులకు తెలియజేయాలి. -
ప్లాస్టిక్‌పై పోరాడదాం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్‌పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీని ప్లాస్టిక్ రహిత దినంగా పాటించాలని ఆకాశవాణిలో ప్రసారమయిన మాసాంతపు మన్‌కీబాత్‌లో ఆయన కోరారు. వచ్చే దీపావళి పండుగ నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలను లేకుండా చేయాలన్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి మొదలయ్యే వార్షిక ‘స్వచ్ఛతే సేవ’లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా జరగనున్న ‘పోషణ్ అభియాన్’లో భాగస్వాములై చిన్నారులు, మహిళలకు పోషకాహారం అందించాలని కోరారు. డిస్కవరీ చానెల్లో ప్రసారమయిన ‘మ్యాన్ వెర్సస్ వైల్డ్’ ఎపిసోడ్లలో సాహసికుడు బేర్ గ్రిల్స్ హిందీని ఎలా అర్థం చేసుకోగలిగారని పలువురు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతే తమకు సాయపడిందన్నారు. నేను హిందీలో మాట్లాడిన మాటలను గ్రిల్స్ చెవిలో ఉండే పరికరం వెంటవెంటనే గ్రహించి అతడికి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి వినిపిస్తుంది. ఇదంతా సాంకేతికత వల్ల సాధ్యమైన అద్భుతం..’ అని పేర్కొన్నారు. -
నా ఫుల్ సపోర్ట్ మోదీకే: రజనీ కాంత్
న్యూ ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తలపెట్టిన ‘స్వచ్చతా హీ సేవా’ కార్యక్రమంలో భాగం కావాలని రాజకీయ, సినిమా, బిజినెస్ ఇలా ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖలో మీకున్న ప్రజాదరణతో అందరిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. మోదీ లేఖకు రజనీకాంత్ వెంటనే స్పందించారు. మీరు తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి నా పూర్తి మద్దతు ఉంటుందని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్లో పరిశుభ్రత దైవభక్తితో సమానమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అభిమానులు సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ ‘త్వరలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నా. రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషం. సినిమాల పరంగానే మా ఇద్దరి మధ్య పోటీ ఉంది. కీలక సమస్యలపై గతంలో మేం చర్చించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆయన మా పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తా. రజనీతో కలిసే పార్టీని ముందుకు తీసుకెళ్తా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. I extend my full support to our hon. Prime Minister @narendramodi ji’s #SwachhataHiSeva mission. Cleanliness is godliness. — Rajinikanth (@superstarrajini) 22 September 2017 -
‘స్వచ్ఛ’ ఉద్యమంలో పాల్గొనండి
మంత్రి కేటీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ సాక్షి, హైదరాబాద్: కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ప్రీతిపాత్రమైన స్వచ్ఛతపై కేటీఆర్‌కు ప్రధాని లేఖ రాశారు. పారిశుధ్యం పట్ల మన దృక్పథం సమాజం పట్ల ఉండే దృక్పథంపై కూడా ప్రతిబింబిస్తుందన్న గాంధీ మాటలను గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర భారత్‌ను సాధించగలమని లేఖలో పేర్కొన్నారు. ప్రతి దేశ పౌరుడు శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ జయంతి రోజు న ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘స్వచ్ఛత హి సేవ’మంత్రంతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. పారిశుధ్యం కోసం పనిచేయడమంటే పేద, బలహీన వర్గాలకు సేవ చేయడమే అన్నారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను లేఖలో ప్రస్తావించారు. సహజ వనరులను పరిరక్షించుకోవడంతో పాటు వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలు చూపడమే స్వచ్ఛ భారత్ లక్ష్యమన్నారు. ‘స్వచ్ఛ యే సేవ’ ఉద్యమానికి మద్దతు తెలపాలని, ‘స్వచ్ఛ భారత్’కు సమయం కేటాయించాలని కేటీఆర్‌కు ప్రధాని సూచించారు. మోదీకి కేటీఆర్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథను గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తడి, పొడి చెత్త , స్వచ్ఛ ఆటోలు, వ్యర్థాల నిర్వహణ వంటి వినూత్న అంశాలతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. ప్రధాని సందేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక శాఖల ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కేటీఆర్ చెప్పారు. Hon'ble PM @narendramodi Ji has written a letter acknowledging Telangana's efforts in Mission Bhagiratha & promoting 'Swachhata Hi Seva' pic.twitter.com/AxQ7DdsjaN — KTR (@KTRTRS) September 14, 2017