4న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
రంగారెడ్డి: ఏప్రిల్ 4న చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 10గంటలకు రథోత్సవం జరగనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ తెలిపారు.