Sweet shops
-
ప్రతి స్వీట్‌కు ఓ తేదీ!
సాక్షి, గుంటూరు: స్వీట్స్ ఇష్టపడని వారెవరుంటారు. కలాకండ్, గులాబ్ జామూన్, లడ్డూ, జిలేబి ఇలా ఎన్నో రకాల స్వీట్లు చూడగానే నోరూరకమానదు. కానీ, మనం కొనే స్వీట్స్ ప్రతిసారి బాగుంటాయని చెప్పలేం. ఎందుకంటే వాటిపై ఎక్స్పైరీ తేదీ ఉండదు. ఈ క్రమంలోనే ప్రజలు ఒక్కో సారి కాలపరిమితి దాటిన స్వీట్లను కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు. అందుకనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా ప్రతి స్వీట్‌పై తయారీ, ఎక్స్పైరీ తేదీ ముద్రించాలని నిబంధన విధించింది. ►జిల్లాలో 400 మంది ఫుడ్‌సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని స్వీట్స్ విక్రయాలు సాగిస్తుండగా మరో 1200 మంది వరకు తోపుడు బండ్లపై అనధికారికంగా అమ్మకాలు చేస్తున్నారు. ►అయితే కొత్త నిబంధనల ప్రకారం స్వీట్లు విక్రయించే ప్రతి ఒక్కరూ ఫుడ్ ఇన్స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. ఏఏ స్వీట్లు.. ఎన్ని రోజుల్లో తినాలి ►కలాకండ్, బట్టర్ స్కాచ్, చాక్లెట్ కలాకండ్ తదితర స్వీట్లు తయారు చేసిన రోజునే తినేయాలి. ►పాల పదార్థాలు, బెంగాలీ స్వీట్స్ , బాదం మిల్క్, రసగుల్ల, రసమలై వంటి స్వీట్లను రెండు రోజుల్లో వినియోగించాలి. ►లడ్డు, కోవాస్వీట్స్, మిల్క్ కేక్, బూందీలడ్డు, కోకోనట్ బర్ఫీ, కోవా బాదం వంటివి తయారు చేసిన నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ►నేతితో చేసిన స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ హాల్వా, డ్రైఫ్రూట్ లడ్డు, అంజీర కేక్, కాజు లడ్డూ వంటి వాటిని వారంలో తినాలి. ►బసెస్ లడ్డూ, అటా లడ్డూ, చనా లడ్డూ, చనా బర్ఫీ, చిక్కీలు తయారు చేసిన 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. రూ.రెండు లక్షల వరకు జరిమానా స్వీట్లు విక్రయించే వ్యాపారులు కచ్చితంగా వాటిపై తయారీ, గడువు తేదీలను ముద్రించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తాం. నాణ్యత లేకుండా, తేదీలు ముద్రించకుండా స్వీట్లు విక్రయిస్తున్న వారి సమాచారాన్ని 98484 70969 నంబర్‌కు తెలియజేయాలి. – షేక్ గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, గుంటూరు -
నోట్ల రద్దుతో 'రసగుల్ల' మల్లగుల్లాలు
కోలకత్తా: బెంగాల్ అంటే స్వీట్లకు పెట్టింది పేరు. కానీ డీమానిటేజేషన్ ప్రభావంతో బెంగాల్ తీపి వంటకాలు చేదెక్కుతున్నాయి. ప్రధానంగా బెంగాలీ స్వీట్ గా పేరొందిన రసగుల్లా అమ్మకాలపై వేటు పడింది. రూ.500 నుంచి రూ .1,000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ కేంద్ర నిర్ణయం తమ స్వీట్ల అమ్మకాలపై భారీగా పడిందని పశ్చిమ బెంగాల్ స్వీట్ వర్తకం దారులు వాపోతున్నారు. ముఖ్యంగా కార్తీక పూజ సందర్భంగా ఏడాదికి సరిపడా ఆదాయం వచ్చే స్వీట్ల అమ్మకాలు భారీగా పడిపోవడం తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందన్నారు. స్థానిక వర్తకులు సమాచారం ప్రకారం ఇక్కడ ఏడాదికి లక్షకోట్ల రూపాయల స్వీట్ల వ్యాపారం జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దుతో రోజుకి నాలుగు నుంచి పదివేలరూపాయల వరకు అమ్మకాలు పడిపోయాయని హౌరాకు చెందిన గంధేశ్వరీ స్వీట్స్ యజమాని ప్రదీప్ హాల్దర్ చెప్పారు. అలాగే రసగుల్లాను పరిచయం చేసిన ధిమాన్ దాస్ కంపెనీ కూడా ప్రస్తుతం తయారీని నిలిపివేసే స్థితికి వచ్చింది. ఎపుడూ భారీ డిమాండ్ ఉండే తమ రసగుల్లా , సందేష్ లకు ప్రస్తుతం డిమాండ్ 30శాతం పడిపోయందని కంపెనీ యజమాని కేసీ దాస్ తెలిపారు. దీంతో పురాతన స్వీట్ షాప్ లోఉత్పత్తిని ఒక రోజు నిలిపివేసినట్టు చెప్పారు. ముఖ్యంగా డెబిట్ కార్డు ఆప్షన్ లేని వీధి వ్యాపారులు భారీగా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు చక్కెర లాంటి ఇతర ముడి పదార్థాలు అందించే విక్రయదారులు పాత నోట్లను అంగీకరించమని తెగేసి చెప్పడం మరింత ఆందోళనకరంగా పరిణమించిందని తెలిపారు. ఇటు పాత నోట్ల చలామణిలేక, అటు కొత్త నోట్లు అందుబాటులోకి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అయితే కొంతమంది నమ్మకస్తులైన కస్టమర్లకు తరువాత చెల్లించే పద్ధతిలో స్వీట్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రూ.100 ల స్వీట్స్ కోసం రూ. 2 వేల నోటు ఇవ్వడంతో చిల్లర కష్టాలు తప్పడంలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే .. తమ వ్యాపార నిర్వహణ ఎలాగో అర్థం కావడంలేదన్నారు. కొత్త నోట్ల కొరతతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే క్రెడిట్ కార్డు అమ్మకాలు బాగా పెరిగినా.. అందరికీ డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపుల అవకాశం లేకపోవడంతో ముఖ్యంగా వీధి వ్యాపారులు బాగా నష్టపోతున్నట్టు చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ మనీ' ని రాష్ట్రంలోని స్వీట్ వ్యాపారులు కొంతమంది ప్రశంసిస్తున్నారు. కొంతకాలం తమకు ఈ కష్టలు తప్పవు అంటూ సరిపెట్టుకోవడం విశేషం. -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
తెనాలి (గుంటూరు) : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని స్వీట్ షాపుల్లో ఆహార నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. రీజినల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచందర్రావు నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం సోదాలు చేపట్టింది. పలు దుకాణాల్లో మిఠాయిల శాంపిల్స్ సేకరించింది. దుకాణాల్లో నాణ్యమైన పదార్థాలతో తయారుచేసిన వంటకాలను విక్రయిస్తున్నారా లేక కాలం చెల్లిన పదార్థాలతో తయారుచేసినవి విక్రయానికి ఉంచుతున్నారా అనేవి పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
రాఖీ సందడి
సదాశివపేట/సిద్దిపేట టౌన్: రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో పండుగ సందడి కనిపించింది. ఆయా చోట్ల వెలిసిన దుకాణాల్లో రాఖీల ను కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు బారులుతీరారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనురాగాలకు చిహ్నంగా జరుపుకునే సంబరాలను వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. రూ.1 నుంచి రూ.150 వరకు మార్కెట్లలో అందుబాటులో ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేటలోని సుభాష్‌రోడ్, బస్టాండ్, మెదక్ రోడ్, మెయిన్‌రోడ్, కాంచీట్ చౌరస్తా, కరీంనగర్ రహదారి పక్కన వందలాది రాఖీల దుకాణాలు వెలిశాయి. 50 పైసల నుంచి రూ. 500ల ఖరీదైన రాఖీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయానికి పెట్టారు. రాఖీలు దుకాణాలు, స్వీట్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడి గా మారాయి. ఆదివారం పండుగ నిర్వహ ణకు వివిధ సంఘాలు ఏర్పాట్లు చేశాయి.