Swetha Ravuri
-
సూపర్ ‘ట్రెండ్స్’
ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ నిత్య నూ తనంగా ఉండడమే ని జమైన ఫ్యాషన్ అని మిసెస్ ఇండియా–2017 శ్వేతా అజయ్రావురి పేర్కొన్నారు. తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ‘ట్రెండ్స్ ’వస్త్ర ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకురాలు శాంతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్ దుస్తులు, బ్రైడల్ కలెక్షన్, పాదరక్షలు, బ్యాగ్‌లు, ఇతర మహిళా ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. -
‘మిసెస్ ఇండియా’ ఫైనల్‌కు అజయ్ భార్య
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు అజయ్ భార్య శ్వేత రావూరి మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 పోటీల్లో ఫైనల్ రౌండ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అజయ్ తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. తన భార్య తుది రౌండ్‌కు ఎంపిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పిన అజయ్ ఆమె ఫేస్బుక్ పేజీని పోస్ట్ చేసి ఆమెను ఆశీర్వదించాలని కోరారు. అలాగే లైక్ కూడా కొట్టాలని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత మహిళలు ఫిట్నెస్గా ఉండటం అంత తేలికైన పనికాదు. ఇద్దరు పిల్లలకు తల్లైయ్యాక అందంపై దృష్టి సారించడం కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. అయితే, ఈ సమస్యను సునాయాసంగా అధిగమించిన అజయ్ భార్య హౌట్ మోంద్ నిర్వహించిన మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 తుది రౌండ్ ఎంపికై ఆశ్చర్య పరిచింది. ఇప్పుడామెను అజయ్ కోరినట్లుగానే ఆశ్వీరదించి ఆల్‌ది బెస్ట్ చెప్పేద్దాం.