ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ నిత్య నూ తనంగా ఉండడమే ని జమైన ఫ్యాషన్ అని మిసెస్ ఇండియా–2017 శ్వేతా అజయ్‌రావురి పేర్కొన్నారు. తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ‘ట్రెండ్స్ ’వస్త్ర ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకురాలు శాంతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్ దుస్తులు, బ్రైడల్ కలెక్షన్, పాదరక్షలు, బ్యాగ్‌లు, ఇతర మహిళా ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment