'స్వైన్ ప్లూపై భయపడాల్సిన పనిలేదు'
హైదరాబాద్: స్వైన్ ప్లూపై భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. స్వైన్ ప్లూ నియంత్రణ చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దాతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిపారు. అన్నిరకాలుగా సహాయం అందిస్తామని వారు హామీయిచ్చారని వెల్లడించారు.
స్వైన్ ప్లూ సమస్య కాదని ప్రైవేటు ఆస్పత్రులు ప్రకటించాయన్నారు. పరిసరాల శుభ్రత పాటిస్తే స్వైన్ ప్లూను 99 శాతం నియంత్రించొచ్చని కేసీఆర్ అన్నారు. ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో స్వైన్ ప్లూ రోగులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వ్యాధితో ఇప్పటివరకు రాష్ట్రంలో 19 మంది మృతి చెందినట్టు తెలిసిందని చెప్పారు.