'గాంధీ'ని సందర్శించనున్న నారాయణ
హైదరాబాద్: రోజు రోజుకు పెరిగిపోతున్న స్వైన్ ఫ్లూ బాధితుల బాగోగులను తెలుసుకోవడానికి సీపీఐ నాయకులు నారాయణ మంగళవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అక్కడ స్వైన్ఫ్లూ రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి నారాయణ అడిగి తెలుసుకోనున్నారు.
నగరంలో తాజాగా మరో 25 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 173 కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు.