తెలంగాణలో స్వైన్‌ప్లూ మరణాలు 34
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1976 స్వైన్‌ప్లూ పరీక్షలు జరపగా, అందులో 668 మందికి స్వైన్‌ప్లూ పాజిటీవ్‌గా నిర్థారించినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో స్వైన్‌ప్లూ వైరస్ బారినపడి 34మంది మృతిచెందినట్టు తెలిపింది. నిన్నటివరకూ 122మందికి పరీక్షలు చేయగా, వారిలో 39 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
స్వైన్‌ప్లూ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఈ వైరస్‌ను నివారించాలంటే ప్రజలందరూ శుభ్రతను పాటించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఒకవేళ స్వైన్‌ప్లూ సోకినట్టు అనుమానం కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించాల్సిందిగా తెలంగాణ ఆరోగ్యశాఖ సూచించింది.