కారులో కన్నుమూసిన పసిపాప
తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ పసిపాప ప్రాణాలు పోవడానికి కారణమైంది. అమ్మానాన్నల నిర్లక్ష్యం ఆ చిన్నారి పాలిట మృత్యుపాశంగా మారింది. తమ కలల పంటను కన్నవారే చేతులారా చిదిమేసుకున్న హృదయ విదారక ఘటన స్విట్జర్లాండ్ తో జరిగింది. 16 నెలల చిన్నారిని కారులోనే వదిలేయడంతో ఊపిరి ఆడక ఆ పసిగుడ్డు ప్రాణాలు వదిలింది. పశ్చిమ స్విట్జర్లాండ్ లోని లా చాక్స్-డీ-ఫాండ్స్ పట్టణంలో చోటు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తల్లి దండ్రులిద్దరూ చిన్నారిని కారులో వదిలేసి కార్యాలయానికి వెళ్లిపోయారు. విధులు ముగించుకుని వచ్చిన తర్వాత మళ్లీ కారు బయటకు తీయడంతో వారికి విషయం అర్థమైంది. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి సొంతబిడ్డ మరణానికి కారుకులైన తల్లిదండ్రులపై క్రిమినల్ కేసు నమోదు చేశారని స్థానిక మీడియా తెలిపింది. కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి.