మావోయిస్టు సానుభూతిపరుడి అరెస్టు
వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో మావోయిస్టు సానుభూతి పరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మండల శ్యాంసుందర్‌రెడ్డి ములుగులో నివాసం ఉంటున్నాడు. అతడు మావోయిస్టులకు ఉత్తరాలు, విప్లవ సాహిత్యం, మందులు, ఆహార పదార్థాలు అందిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.