వరకట్న హత్య కేసులో పదేళ్ల జైలు
ఖమ్మం లీగల్: వరకట్న హత్య కేసులో ఓ యువకునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువేల రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్ గురువారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం...
ఖమ్మంలోని మంచికంటి నగర్‌కు చెందిన పర్వీన్‌కు, బొక్కలగడ్డకు చెందిన సయ్యద్ గౌస్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. కట్నం కింద లక్షన్నర రూపాయలు, బంగారు ఆభరణాలు, ఇంటి సామాన్లను పర్వీన్ తల్లిదండ్రులు ఇచ్చారు.
వివాహనంతరం ఆరు నెలలపాటు గౌస్, పర్వీన్ దంపతుల కాపురం సంతోషంగా సాగింది. ఆ తరువాత నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యూరుు. పిల్లలు పుట్టడం లేదంటూ ఆమెను భర్త గౌస్, అతని తల్లితండ్రులు వేధించసాగారు. ఆమె శీలాన్ని కూడా శంకించారు. అధిక కట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి కూడా వెళ్లగొట్టారు. దీంతో, 2013 మార్చి 17న ఖమ్మంలోని మహిళ పోలీస్‌స్టేషన్‌లో పర్వీన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అక్కడ కూడా.. తనకు విడాకులు ఇవ్వాలని పర్వీన్‌ను గౌస్ కోరాడు.
2013 ఏప్రిల్ 28న పర్వీన్ తన భర్త ఇంటికి వెళ్లింది. ఆమెను భర్త, అతని కుటుంబీకులు ఇంట్లోకి అనుమతించలేదు. ఆమె ఎంతగా బతిమిలాడినా కనికరించలేదు. చివరికి ఆమె అదే రోజు సాయంత్రం తన పుట్టింటికి వెళ్లిపోరుు, స్నానాల గదిలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె తీవ్ర గాయూలతో 2013 మే 5న ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందింది. ఆమె తల్లి షేక్ గౌసియాబేగం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్ గురువారం తీర్పునిచ్చారు.
మొదటి నిందితుడైన పర్వీన్ భర్త సయ్యద్ గౌస్(27)పై నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించారు. పర్వీన్‌ను వేధించినందుకుగాను మరో మూడేళ్ల జైలు శిక్ష, మూడువేల రూపాయల జరిమాన విధించారు.
ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. నేరం రుజువు కానందున మరో ముగ్గురు నిందితులు సయ్యద్ జహీరాబీ, సయ్యద్ చాంద్, సయ్యద్ షాహనాజ్‌ను విడుదల చేశారు. ప్రాసిక్యూషన్‌తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.అంజయ్య వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మోహన్‌రావు, కోర్టు కానిస్టేబుళ్లు రామారావు, ఖాజామియా, హోంగార్డులు సయ్యద్ యూసుఫ్, చిట్టిబాబు సహకరించారు.