నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కడప అర్బన్, న్యూస్‌లైన్ ః సిండికేట్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (సిండ్ ఆర్సెటి) ఆధ్వర్యంలో ఎంబ్రాయడరీ- ప్యాబ్రిక్పెయింటింగ్, ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ -పంపుసెట్ నిర్వహణ, సెల్‌ఫోన్ మరమ్మతులు, మహిళా దుస్తుల తయారీ అనే అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు డైరక్టర్ రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఫెయిల్ లేదా పాస్అయిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. విద్యార్హతకు సంబంధించిన టీసీ, మార్కులిస్టు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు తెల్లరేషన్‌కార్డు జిరాక్స్‌తో డెరైక్టర్, సిండ్ ఆర్సెటీ, ఆర్టీసీ వర్క్ షాపు దగ్గర, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన కడప అనే చిరునామాకు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తులు పంపాలన్నారు. శిక్షణా కాలంలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 08562 200193, 9440905478 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.